News January 27, 2025

దెందులూరు: హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి

image

ఏలూరు జిల్లాలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. దెందులూరు(M) పోతులూరి సమీపంలో హైవేపై వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి కంటైనర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరికి గాయాలు కాగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెదవేగి సీఐ వెంకటేశ్వరరావు, దెందులూరు ఎస్ఐ శివాజీ మృతదేహాలను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు ఉండి మండలం ఉప్పులూరుకు చెందిన వారని తెలుస్తోంది.

Similar News

News February 28, 2026

KK లైన్ కోల్పోయిన దక్షిణ కోస్తా రైల్వే జోన్

image

APకి కీలకమైన కొత్తవలస-కిరండోల్ (KK లైన్) మార్గం దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధి నుంచి రాయగడ డివిజన్‌లోకి వెళ్లింది. వాల్తేరు డివిజన్‌లో KK లైన్లోని అరకు, బొర్ర గుహాలు, ఐరన్ ఓర్, బొగ్గు వంటి కార్గో రవాణాతో జోన్‌కు భారీ ఆదాయం వచ్చేది. కొత్తవలస జంక్షన్‌తో పాటు VZM, SKLM జిల్లాల్లోని కీలక సెక్షన్లు రాయగడ డివిజన్, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌కు వెళ్లాయి. ఈ జోన్ ఆర్థిక స్థిరత్వంపై తీవ్ర ప్రభావం పడనుంది.

News February 28, 2026

కరీంనగర్ ప్రగతికి ‘త్రిశూల’ వ్యూహం!

image

కరీంనగర్ అభివృద్ధి ఇప్పుడు ముగ్గురు నాయకులపై ఆధారపడి ఉంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ‘స్మార్ట్ సిటీ’ నిధులపై పట్టు సాధిస్తుండగా, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టేందుకు కృషి చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కోసం ఒత్తిడి తెస్తున్నారు. రాజకీయ వైరుధ్యాలు ఉన్నప్పటికీ ఈ ముగ్గురు కీలక నేతలతో నగరం రూపురేఖలు మారుతాయా లేదో చూడాలి.

News February 28, 2026

చిలుకూరు ఆలయానికి వన్నె తెచ్చింది ఆయనే!

image

చిలుకూరు బాలాజీ దేవాలయానికి ప్రధాన అర్చకుడు సౌందరరాజన్ వన్నె తెచ్చారు. HYDకు కూతవేటు దూరంలో మొయినాబాద్ మం.చిలుకూరులో ఉన్న బాలాజీ గుడికి 2000 సంవత్సరం వరకు పెద్దగా ప్రాచుర్యంలేదు. సౌందరరాజన్ ఉద్యోగ విరమణ తర్వాత ఆలయానికి వచ్చి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు. అప్పటి వరకు ఉత్సవాల సమయంలోనే భక్తులు వచ్చేవారు. స్వయం ప్రతిపత్తి దేవాలయంగా ప్రకటించి హుండీ, కానుకలు, టికెట్లు లేకుండా ఆలయాన్ని నడిపించారు.