News January 27, 2025

ఉండి: హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి

image

ఏలూరు జిల్లాలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. దెందులూరు మండలం పోతులూరి సమీపంలో హైవేపై ట్రాక్టర్‌ను వెనుక నుంచి కంటైనర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరికి గాయాలు కాగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెదవేగి సీఐ వెంకటేశ్వరరావు, దెందులూరు ఎస్ఐ శివాజీ మృతదేహాలను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు ఉండి మండలం ఉప్పులూరుకు చెందిన వారని తెలుస్తోంది.

Similar News

News April 22, 2025

భీమవరం లాడ్జిలో పోలీసుల తనిఖీలు

image

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఓ రెసిడెన్షియల్ & లాడ్జిపై టూ టౌన్ సీఐ కాళీ చరణ్ తన సిబ్బందితో కలిసి సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 18 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారిలో 9మంది అమ్మాయిలు, 9మంది అబ్బాయిలు ఉన్నారు. వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. లాడ్జి నిర్వాహకుడు అంతం శ్రీను పరారైనట్లు స్థానికులు తెలిపారు.

News April 22, 2025

ప.గో: అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి- జేసి

image

రీ ఓపెన్ అయినా అర్జీల విషయంలో మరింత జవాబుదారితనం కలిగి ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కారం తీసుకున్న చర్యలు, రీ ఓపెన్ అయిన అర్జీల పరిష్కారానికి తీసుకున్న చర్యలపై జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌లోని సమస్యలపై చర్యలు చేపట్టి పరిష్కరించాలన్నారు.

News April 22, 2025

‘ప్రభుత్వ పాఠశాలల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయులచే విద్య’

image

ప్రభుత్వ పాఠశాలల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయులచే విద్యను నేర్చుకుని మంచి ప్రయోజకులు కావాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధనపై శిక్షణ పొందిన ఉపాధ్యాయులు మాత్రమే ఉంటారని, నిర్ణీత విద్య అర్హతలతోపాటు పోటీ పరీక్షలలో అర్హత సాధిస్తేనే ఉపాధ్యాయులుగా పాఠశాలలో నియమించడం జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందన్నారు.

error: Content is protected !!