News March 18, 2024
NLG: ఏడేళ్ల తర్వాత వెనక్కి వెళ్లిన కృష్ణా జలాలు

ఏడేళ్ల తర్వాత కృష్ణా వెనుక జలాలు భారీగా వెనక్కి వెళ్లాయి. చేపలవేట చేసుకొని జీవనోపాధి పొందుతున్న మత్స్య కార్మికులకు ఈ ఏడాది కష్టంగా మారనుంది. నిత్యం చేపల కోసం మర బోట్లతో వేట కొనసాగించాల్సిన మత్స్యకార్మికుల కంటిచూపు మేర జలాలు వెనక్కి వెళ్లడంతో వారి మరబోట్లు ఒడ్డుకు చేరాయి. దీంతో చేపలవేట తగ్గుముఖం పట్టి ఇంటి వద్దే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Similar News
News January 26, 2026
నల్గొండ: నోటిఫికేషన్ ముంగిట అభ్యర్థుల వేట

రెండు మూడు రోజుల్లో మునిసిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలుండటంతో జిల్లాలో రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు. నల్గొండలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ నాలుగు డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించింది. రిజర్వేషన్ల మార్పులు, ఒక్కో వార్డులో పలువురు ఆశావహులు ఉండటంతో ఎంపిక కష్టంగా మారింది. గెలుపు గుర్రాల కోసం ఇప్పటికే పలుమార్లు సర్వేలు చేశారు.
News January 26, 2026
నల్గొండ కలెక్టరేట్లో గణతంత్ర వేడుకలు

నల్గొండ కలెక్టరేట్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆయన జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
News January 26, 2026
నల్గొండ: షోరూంలోనే రిజిస్ట్రేషన్ ప్రారంభం

నల్గొండ జిల్లాలో వాహన రిజిస్ట్రేషన్ల కొత్త ప్రక్రియ ప్రారంభమైంది. షోరూంలలోనే రిజిస్ట్రేషన్ చేసే విధానంలో తొలిరోజు మూడు బైకులకు డీలర్ పాయింట్ వద్దే నంబర్లు కేటాయించారు. డీలర్లు ఆన్లైన్లో దరఖాస్తు చేయగా, ఆర్టీఓ అధికారులు పర్మినెంట్ నంబర్లు జారీ చేశారు. జిల్లాలో రోజుకు సగటున 100 వాహనాల రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా, తాజా మార్పుతో వాహనదారులకు ఇబ్బందులు తప్పనున్నాయి.


