News January 27, 2025

ADB: నాగదేవుడు పాలు తాగుతాడనే విశ్వాసం.!

image

నాగోబాలో రేపటి నుంచి ప్రారంభం కానున్న జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మెస్రం వంశీయులు గోదావరి నుంచి తెచ్చిన జలంతో నాగోబా దేవుడి విగ్రహాన్ని, ఆలయాన్ని శుభ్రపరిచి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ సమయంలో మొలకెత్తిన నవధాన్యాలు, రాగి ముంతలో పాలు తెస్తారు. నవధాన్యాలు, మొలకలు, పాలు అన్నింటిని కొత్త టవల్‌తో కప్పి పుట్టపై ఉంచుతారు. అయితే నాగదేవుడు రాగి చెంబులోని పాలు తాగుతాడనే విశ్వాసం వారిలో ఉంది.

Similar News

News September 14, 2025

HYD: కృతిక ఇన్‌ఫ్రా డెవలపర్స్ ఎండీ అరెస్ట్

image

ప్లాట్ల అమ్మకం ముసుగులో చీటింగ్ చేసి పరారీలో ఉన్న కృతిక ఇన్‌ఫ్రా డెవలపర్స్ ఎండీని LBనగర్ SOT బృందం, LBనగర్ పోలీసులు అరెస్టు చేశారు. వివిధ ప్రదేశాల్లో ప్లాట్లను అమ్మే ముసుగులో భారీగా డబ్బు కాజేసి చాలా మందిని మోసం చేసిన ఆదిభట్లకు చెందిన శ్రీకాంత్(35)ను జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. అతడిపై సరూర్‌నగర్, వనస్థలిపురం, మేడిపల్లిలో కేసులు ఉన్నాయని సీఐ వినోద్ కుమార్ తెలిపారు.

News September 14, 2025

సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దు

image

AP: సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దైంది. అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో పర్యటన రద్దైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, ఏవియేషన్ అధికారుల నుంచి క్లియరెన్స్ వస్తే సీఎం తిరుపతి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తిరుపతిలో జరుగుతున్న మహిళా సాధికారత సదస్సులో ఇవాళ సీఎం పాల్గొనాల్సి ఉంది.

News September 14, 2025

కృష్ణాపురం నవోదయలో ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ దాష్టీకం

image

మర్రిపాడు మండలం కృష్ణాపురంలోని జవహర్ నవోదయ స్కూల్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గత రాత్రి స్టడీ అవర్స్‌లో మహేష్ అనే విద్యార్థిపై ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ పెత్తన స్వామి దాడికి పాల్పడ్డారు. దీంతో మహేశ్‌ తలకు తీవ్ర గాయం అయ్యింది. అంతటితో ఆగకుండా ఆ విద్యార్థిని వాష్ రూమ్‌లో లాక్ చేసిన ఉదయం వరకు లాక్ తియ్యొద్దని స్టాఫ్‌ని హెచ్చరించారు. టీచర్లు కలిసి విద్యార్థిని మర్రిపాడు ఆస్పత్రికి తరలించారు.