News January 27, 2025

గుంజపడుగు: అనారోగ్యంతో యువకుడి మృతి

image

మంథని మండలం గుంజపడుగులో విషాదం నెలకొంది. బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. అక్కపాక నరేశ్(34) గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే, గత వారం రోజులుగా నరేశ్ జ్వరంతో బాధపడుతున్నాడు. రెండు రోజుల నుంచి జ్వరం విషమించడంతో లివర్ ఇన్ఫెక్షన్ వచ్చి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Similar News

News July 5, 2025

చొప్పదండి: తైక్వాండో ఛాంపియన్లను అభినందించిన కేంద్రమంత్రి

image

చొప్పదండి పట్టణానికి చెందిన తైక్వాండో ఛాంపియన్లను కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శనివారం అభినందించారు. జూన్ 23 నుంచి 25వ తేదీ వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లో తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. పడకంటి కాశీ విశ్వనాద్, భూసారపు వెంకటేష్ గౌడ్, స్పందన, సౌమ్య, రామ్ చరణ్ అనే విద్యార్థులు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి ఏడు గోల్డ్, ఒకటి సిల్వర్, ఒకటి రజిత పథకాలు సాధించారు.

News July 5, 2025

రొట్టెల పండుగకు 1,700 మంది పోలీసు సిబ్బంది: IG

image

రొట్టెల పండుగను పటిష్ట బందోబస్త్ నడుమ ప్రశాంతంగా నిర్వహహించడమే లక్ష్యమని IG సర్వశ్రేష్ట త్రిపాఠి తెలిపారు. శనివారం ఆయన రొట్టెల పండుగ బందోబస్త్ ఏర్పాట్లను ఎస్పీ కృష్ణకాంత్‌తో కలసి నిర్వహించారు. పోలీసు సిబ్బంది మానవతాదృక్పదంతో వ్యహరించి విధులు నిర్వహించాలని సూచించారు. 1,700 మంది పోలీసు ఫోర్స్‌తో సర్వం సన్నద్ధం చేశామని తెలిపారు. రొట్టెల పండుగలో వాహనాల పార్కింగ్ అనేది కీలకం అని చెప్పారు.‌

News July 5, 2025

పెగడపల్లి: ‘ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలి’

image

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. శనివారం రాత్రి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఆరవెల్లిలో పల్లె దవాఖానను మంత్రి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు.