News March 18, 2024

గద్వాల: పరీక్షకు వెళ్తుండగా ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు

image

గద్వాల జిల్లా మానవపాడు మండలం చిన్న పోతులపాడుకి చెందిన ప్రవీణ్, మధు అనే టెన్త్ విద్యార్థులు ఉదయం పరీక్ష రాసేందుకు బైక్ పై స్వగ్రామం నుంచి మానవపాడులోని పరీక్షా కేంద్రానికి వెళ్తుండగా మానవపాడు శివారులో బైక్ అదుపుతప్పి కిందపడ్డారు. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా అటుగా వెళుతున్న ప్రయాణికులు గ్రహించి మానవపాడు ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించి కర్నూలుకు తరలించారు. దీంతో వారు తొలిరోజు పరీక్ష తప్పారు.

Similar News

News April 10, 2025

మహబూబ్‌నగర్: నేటి నుంచి వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు

image

మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌కొండ మండలంలోని ఆచార్యపూర్ గ్రామంలో నెలకొన్న శ్రీవీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభమై సోమవారం వరకు ఐదు రోజులపాటు కొనసాగానున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా వ్యవస్థాపకుడు తమ్మళి విజయకుమార్, రాజేశ్వర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఉత్సవాలకు ఉమ్మడి జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లా, కర్ణాటక రాష్టం నుంచి భక్తులు వస్తుంటారు.

News April 10, 2025

పాలమూరు: నేడు భారీ వర్షం.. ఎల్లో హెచ్చరిక జారీ

image

ఉమ్మడి MBNRజిల్లాలో ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. క్యూములోనింబస్ మేఘాల వల్ల వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈమేరకు MBNR, NGKL జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. GDWL, NRPT, WNPలో మోస్తరుగా వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఇటీవల పాలమూరులో పిడుగు పాటుకు ఒకేరోజు ఐదుగురు మరణించారు. జర జాగ్రత్త. SHARE IT

News April 10, 2025

బాలానగర్: రైలు ఢీకొని.. వృద్ధురాలు మృతి

image

రైలు ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లి రైల్వే ట్రాక్‌పై బుధవారం జరిగింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ మల్లేశ్వర్ వివరాల ప్రకారం.. పెద్దాయపల్లికి చెందిన బొట్టు మైసమ్మ (60) హైదరాబాద్ నుంచి రాయచూర్ వెళ్తున్న రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. స్టేషన్ మాస్టర్ నర్సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

error: Content is protected !!