News January 27, 2025

పల్నాడు శకటానికి ప్రథమ బహుమతి

image

పల్నాడు జిల్లా మహిళాభివృద్ధి – శిశు సంక్షేమ శాఖ శకటానికి ప్రథమ బహుమతి లభించింది. రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనలో అంగన్వాడీ కేంద్రం, వన్ స్టాప్ సెంటర్, బాధిత మహిళలకు అందించే కౌన్సిలింగ్, వైద్య, న్యాయ, దత్తత, సహాయాలను డిపార్ట్మెంట్ అధికారులు శకటంపై దృశ్య రూపంలో ప్రదర్శించారు. ప్రాజెక్టు జిల్లా అధికారి ఆర్.కుమిదిని కలెక్టర్ పి అరుణ్ బాబు చేతుల మీదగా ప్రథమ బహుమతి అందుకున్నారు.

Similar News

News October 31, 2025

జగిత్యాల వ్యవసాయ మార్కెట్ ధరలు ఇలా..

image

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో గురువారం వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర ₹2011, కనిష్ఠ ధర ₹1700, వరి ధాన్యం (1010) గరిష్ఠ ధర ₹1820, కనిష్ఠ ధర ₹1775, వరి ధాన్యం (JSR) ధర ₹1950గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు. అటు మార్క్‌ఫెడ్ ద్వారా నేడు మక్కల కొనుగోళ్లు జరగలేదని పేర్కొన్నారు.

News October 31, 2025

వాంకిడి: ‘నా కూతురు చావుకి కారుకులైన వారిని శిక్షించాలి’

image

తన కూతురు ప్రేమలత చావుకి కారకులైన వారిని శిక్షించాలని తండ్రి మేంఘజి కోరారు. ఈ మేరకు వాంకిడి ఎస్ఐ మహేందర్‌కి ఫిర్యాదు చేశాడు. ఖిరిడికి చెందిన ప్రేమలత(22)అదే గ్రామానికి చెందిన మహేశ్‌ను వివాహం చేసుకుంది.ఈనెల 23న పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబీకులు ఆమెను వర్ధా ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ 29న మృతిచెందింది. అత్తింటి వారి వరకట్న వేధింపులతో ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదు చేశారు.

News October 31, 2025

జిల్లాలో పంట ధాన్యాల కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైంది: నిర్మల్ కలెక్టర్

image

జిల్లాలో పంట ధాన్యాల కొనుగోలు ప్రక్రియను ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించామన్నారు. నేటి వరకు జిల్లాలో 10 సోయాబీన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. మొక్కజొన్న కేంద్రాలను ప్రారంభించడంతోపాటు, ఈరోజు వరకు మొత్తం 29,100 క్వింటాళ్ల మొక్కజొన్న పంటను కొన్నామన్నారు.