News January 27, 2025

పరిధి దాటేసిన ఏఐ.. మరింత ప్రమాదం?

image

AI ఉపయోగాలు కోకొల్లలు. కానీ దాని వల్ల వాటిల్లే ఉపద్రవాల గురించే ఆందోళన ఎక్కువగా ఉంది. దానిని నిజం చేసేలా AI మోడల్ తాజాగా తనను తానే క్లోనింగ్ చేసుకుంది. అలీబాబా, మెటా సంస్థలకు చెందిన రెండు లాంగ్వేజ్ మోడల్స్‌ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ‘మోడల్ షట్‌డౌన్ కాకుండా ఉండేందుకు అపరిమిత క్లోనింగ్ చేసుకోగలుగుతోంది. అవసరమైతే వ్యవస్థను రీస్టార్ట్ చేస్తోంది. ఇది చాలా ప్రమాదకరం’ అని పరిశోధకులు హెచ్చరించారు.

Similar News

News September 15, 2025

రూ.5కే కిలో టమాటా

image

AP: ఓవైపు తగ్గిన ఉల్లి ధరలు రైతులను ఆందోళనకు గురిచేస్తుంటే టమాటా ధరలూ అదే బాటలో పయనిస్తున్నాయి. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి మార్కెట్‌లో ఇవాళ టమాటా ధరలు కేజీ రూ.5కు పడిపోయాయి. దిగుబడి పెరగడంతో ధరలు పతనమవుతున్నాయి. దీంతో గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. మీ ఏరియాలో టమాటా ధర ఎంత ఉందో కామెంట్ చేయండి?

News September 15, 2025

AI కంటెంట్‌పై కేంద్రం కీలక నిర్ణయం?

image

ఏఐ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ఇకపై ఏఐ జనరేటెడ్ వీడియోలు, ఫొటోలు, ఆర్టికల్స్ అన్నింటికీ కచ్చితంగా లేబుల్ ఉండేలా చర్యలు తీసుకోవాలని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించిన ముసాయిదా రిపోర్టును లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించింది. ఏఐ కంటెంట్ సాధారణ పౌరులతోపాటు వీఐపీలను కూడా అయోమయానికి గురి చేస్తోందని పేర్కొంది.

News September 15, 2025

రాయలసీమ కోనసీమ అవుతోంది: సీఎం

image

AP: రాయలసీమలో డ్రిప్ ఇరిగేషన్ లాంటి విధానాలతో మంచి ఫలితాలు సాధించామని, ఇప్పుడది కోనసీమగా మారుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. పట్టిసీమతో డెల్టాలో వాడే కృష్ణానీటిని పొదుపు చేసి శ్రీశైలం ద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగామని తెలిపారు. హంద్రీనీవా కాలువతో కుప్పం వరకూ కృష్ణా నీళ్లు తీసుకెళ్లామన్నారు. వాణిజ్య పంటల విషయంలోనూ సరైన సమయానికి నిర్ణయాలు తీసుకుని లాభం వచ్చేలా చేయాలని కలెక్టర్లకు సూచించారు.