News January 27, 2025

బెల్లంకొండ: చేతబడి కలకలం.. భయాందోళనలో గ్రామస్థులు

image

బెల్లంకొండ మండలం వెంకటాయపాలెం గ్రామంలో ఎస్టీ కాలనీలో సుమారు 12 గృహాల ముందు ముగ్గు, నిమ్మకాయలు, ఎరుపు రంగు వస్త్రం, ఎండు మిరపకాయలతో కొన్ని వస్తువులను ఆదివారం రాత్రి సమయంలో పడేసి వెళ్లారు. సోమవారం ఉదయం గ్రామస్థులు వాటిని చూసి భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలో చేతబడి నిర్వహిస్తున్నారని పెద్ద ఎత్తున గ్రామస్థులు మాట్లాడుకుంటున్నారు. ఇళ్లను వదిలి ప్రజలు బయటికి రావటం లేదు.

Similar News

News September 19, 2025

బగ్రామ్ ఎయిర్‌బేస్‌ స్వాధీనం చేసుకోవాలి: ట్రంప్

image

అఫ్గానిస్థాన్‌లోని బగ్రామ్ ఎయిర్‌బేస్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. గత ప్రెసిడెంట్ జోబైడెన్ ఎలాంటి ప్రయోజనం లేకుండానే ఆ స్థావరాన్ని వదిలేశారని విమర్శించారు. చైనా అణ్వాయుధ ఉత్పత్తి కేంద్రాల నుంచి కేవలం గంటలోనే ఈ ఎయిర్‌బేస్‌కు చేరుకోవచ్చని తెలిపారు. భవిష్యత్తులో చైనా ఈ స్థావరాన్ని చేజిక్కించుకుంటుందన్న అనుమానంతోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

News September 19, 2025

కరీంనగర్: చెత్త వేయకుండా ఇనుప జాలి ఏర్పాటు

image

కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియం, బస్టాండ్ వెనుక రోడ్డులో ప్రజలు చెత్త వేయకుండా మున్సిపల్ అధికారులు ఇనుప జాలిని ఏర్పాటు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయవద్దని అధికారులు పదేపదే సూచించినా ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నారు. నగర పరిశుభ్రతను కాపాడటానికి అందరూ సహకరించాలని అధికారులు కోరారు.

News September 19, 2025

శంకరపట్నం: యాదవ్ చైతన్య వేదిక జిల్లా ఉపాధ్యక్షుడిగా ఐలయ్య యాదవ్

image

శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన గుండెవేని ఐలయ్య యాదవ్‌ను యాదవ చైతన్య వేదిక జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించినట్లు రాష్ట్ర యాదవ చైతన్య వేదిక అధ్యక్షులు గొర్ల ఐలేష్ యాదవ్ తెలిపారు. శంకరపట్నం మండల కేంద్రంలో ఈ నియమకం జరిగినట్లు చెప్పారు. జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు గొర్ల ఐలేష్ యాదవ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాజయ్యలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.