News March 18, 2024

వైసీపీ మేనిఫెస్టో ప్రకటన వాయిదా!

image

AP: ఈనెల 20న జరగాల్సిన వైసీపీ మేనిఫెస్టో ప్రకటన కార్యక్రమం వాయిదా పడినట్లు తెలుస్తోంది. ‘జగన్ చెప్పాడంటే.. చేస్తాడంతే అనే నమ్మకం’ పేరుతో మేనిఫెస్టోను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రైతులు, కార్మికులు, వృద్ధులు, మహిళలు, యువత, విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేసే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Similar News

News December 24, 2024

BIG ALERT: నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఏపీ, ఉత్తర తమిళనాడు తీరాల వైపు పయనిస్తోందని IMD తెలిపింది. దీని ప్రభావంతో 3 రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందంది. ఇవాళ ఉత్తరాంధ్ర, ఉమ్మడి గోదావరి, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు పడతాయని పేర్కొంది. మరోవైపు AP, తమిళనాడుల్లోని అన్ని పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

News December 24, 2024

Stock Markets: మెటల్, రియాల్టి షేర్లపై ఒత్తిడి

image

బెంచ్‌మార్క్ సూచీలు ఫ్లాటుగా మొదలయ్యాయి. నిఫ్టీ 23,723 (-31), సెన్సెక్స్ 78,434 (-111) వద్ద ట్రేడవుతున్నాయి. అనిశ్చితి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. IT, O&G షేర్లకు డిమాండ్ నెలకొంది. మెటల్, రియాల్టి, ఫార్మా, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలపై ఒత్తిడి ఉంది. టాటా మోటార్స్, TCS, NESTLE, BRITANNIA, BAJAJ AUTO టాప్ గెయినర్స్. JSW STEEL, TATA STEEL, AIRTEL, SBI LIFE టాప్ లూజర్స్.

News December 24, 2024

సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్‌?

image

TG: అల్లు అర్జున్ కాసేపట్లో చిక్కడపల్లి పోలీసుల విచారణకు హాజరు కానున్నారు. సీన్ ఆఫ్ అఫెన్స్ కోసం అవసరమైతే సంధ్య థియేటర్‌కు రావాల్సి ఉంటుందని పోలీసులు నిన్న బన్నీకి ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్‌ దాదాపు 10 ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుందని సమాచారం. బన్నీ ఇటీవల ప్రెస్‌మీట్లో మాట్లాడిన ఆరోపణలపై విచారించే అవకాశం ఉంది. 11గంటలకు ఆయన PSకు వెళ్లనున్నారు.