News March 18, 2024

హీరోయిన్‌కు యాక్సిడెంట్.. ఐసీయూలో చికిత్స

image

మలయాళ హీరోయిన్ అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. స్కూటీపై వెళ్తుండగా కారు ఢీకొట్టినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె తిరువనంతపురంలోని ఆస్పత్రిలో ICUలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు రావాలని మరో నటి గోపికా అనిల్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘పొంగి ఎజు మనోహర’ చిత్రంతో హీరోయిన్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అరుంధతి.. 7 సినిమాలు, 2 వెబ్‌సిరీస్‌లలో నటించారు.

Similar News

News December 24, 2024

శ్రీవారి భక్తులకు మరింత నాణ్యమైన సేవలు: బీఆర్ నాయుడు

image

శ్రీవారి భక్తులకు మరింత నాణ్యమైన సేవల్ని అందిస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు హామీ ఇచ్చారు. ఈరోజు జరిగిన TTD ధర్మకర్తల మండలి సమావేశంలో ‘స్విమ్స్‌కు జాతీయ హోదాకు సిఫార్సు, అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీనివాసుడి ఆలయాల నిర్మాణం, ఒంటిమిట్ట కోదండ రామాలయ విమాన గోపురానికి రూ.43 లక్షలతో బంగారు కలశం, తిరుమలలో ప్రత్యేక ఫుడ్ సేఫ్టీ విభాగం’ నిర్ణయాలను తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

News December 24, 2024

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ షెడ్యూల్ ఇదే

image

ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. గ్రూప్ దశలో భారత్ మొత్తం 3 మ్యాచులు ఆడనుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్, 23న పాకిస్థాన్, మార్చి 2న న్యూజిలాండ్‌తో తలపడనుంది. భారత్ ఆడే మ్యాచులన్నీ దుబాయ్‌లో జరుగుతాయి. మార్చి 4న సెమీఫైనల్-1, 5న సెమీఫైనల్-2, 9న ఫైనల్ మ్యాచులు జరుగుతాయి. భారత్ ఫైనల్‌కు చేరితే ఈ మ్యాచ్‌ దుబాయ్‌లో జరుగుతుంది. లేదంటే లాహోర్‌లో నిర్వహిస్తారు.

News December 24, 2024

2024లో పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు

image

☛ ఐరా ఖాన్-నుపుర్ శిఖరే (JAN 3)
☛ తాప్సి-మథియాస్ బో (MARCH 23)
☛ సోనాక్షి సిన్హా-జహీర్ ఇక్బాల్ (JUNE 23)
☛ అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ (JULY 12)
☛ సిద్ధార్థ్-అదితి రావు హైదరీ (SEP 16)
☛ అక్కినేని నాగచైతన్య-శోభిత (DEC 4)
☛ కీర్తి సురేశ్-ఆంటోనీ (DEC 12)
☛ పీవీ సింధు-వెంకట్ దత్తా (DEC 22)