News January 27, 2025
GWL: ఇథనాల్ కంపెనీ రద్దు చేసే వరకు పోరాడుతాం..!

గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద దన్వాడ సమీపంలో నిర్మిస్తున్న ఇథనాల్ కంపెనీ రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని పరిసర గ్రామాల రైతులు నర్సింహులు, సుధాకర్ పేర్కొన్నారు. సోమవారం 5వ రోజు దీక్షా శిబిరం వద్ద ఆయా గ్రామాల మహిళలతో రిలే దీక్షలు చేపట్టారు. ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా కంపెనీ నిర్మాణం చేయడం ఏమిటని ప్రశ్నించారు. కంపెనీ నిర్మాణం వల్ల తుంగభద్రా నది పరివాహక ప్రాంతం కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు.
Similar News
News September 16, 2025
ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న మంత్రి తుమ్మల

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అధికారికంగా నిర్వహిస్తోంది. భద్రాద్రి జిల్లా కేంద్రంలో జరిగే ఈ వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొంటారని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అధికారులు, ప్రజలు హాజరుకావాలని కోరారు.
News September 16, 2025
ఏయూ: LAW కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్

ఈ విద్యాసంవత్సరానికి గానూ విశాఖలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కాలేజ్ ఆఫ్ LAW లో కోర్సులకు ఏయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 5 ఏళ్ల LLB, 3 ఏళ్ల LLB, 2 ఏళ్ల పీజీ LLM కోర్సుల్లో సెల్ఫ్ సపోర్ట్ అడ్మిషన్లు కలవు. సెప్టెంబర్ 27వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 29న కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. LAWCET/CLAT క్వాలిఫైడ్ విద్యార్థులకు ప్రాధాన్యం.
News September 16, 2025
కోహ్లీ బయోపిక్ డైరెక్ట్ చేయను: అనురాగ్ కశ్యప్

కోహ్లీ అంటే అభిమానం ఉన్నా ఆయన బయోపిక్‌కు తాను దర్శకత్వం వహించనని డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ అన్నారు. కోహ్లీ అంటే అందరికీ ఇష్టమని, ఆయనొక అద్భుతమని కొనియాడారు. ఒకవేళ ఎవరిదైనా బయోపిక్ చేయాల్సి వస్తే కష్టమైన సబ్జెక్ట్‌నే ఎంచుకుంటానని తెలిపారు. సాధారణ వ్యక్తి జీవితాన్ని తెరపై చూపిస్తానని పేర్కొన్నారు. కాగా అనురాగ్ తెరకెక్కించిన ‘నిషాంచి’ మూవీ ఈ నెల 19న రిలీజ్ కానుంది.