News March 18, 2024

MDK: హరీశ్‌రావు వ్యూహం.. BRS గెలుస్తుందా?

image

ఉమ్మడి మెదక్ జిల్లాలోని 2 పార్లమెంట్ స్థానాల్లో BRS జెండా ఎగరేసేందుకు ట్రబుల్ షూటర్ హరీశ్‌రావు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ఈమేరకు ఇప్పటికే క్షేత్రస్థాయిలో నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో ఈసారి గెలుపే ధ్యేయంగా వ్యూహాలు రచిస్తున్నట్లు శ్రేణులు చెబుతున్నాయి. మరి హరీశ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా చూడాలి.

Similar News

News January 28, 2026

మెదక్: రంజాన్ మాసం శాంతియుత నిర్వహణకు కలెక్టర్ ఆదేశాలు

image

పవిత్ర రంజాన్ మాసాన్ని ప్రశాంతంగా జరుపుకునే విధంగా జిల్లా అధికారులు సన్నాహకాలు చేపట్టనున్నారు. కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమీక్షలో, మసీదులు, ప్రార్థన మందిరాల వద్ద భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, కట్టుదిట్టమైన బందోబస్తు, పారిశుద్ధ్యం, త్రాగునీటి, విద్యుత్ సరఫరా చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు.

News January 28, 2026

MDK: మెదక్ కలెక్టరేట్‌లో మీడియా సెంటర్ ప్రారంభం

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో మీడియా సెంటర్‌ను కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, అదనపు కలెక్టర్ నగేశ్ పాల్గొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా మీడియా సెంటర్ ద్వారా అభ్యర్థుల పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారంపై నిఘా ఉంటుందని కలెక్టర్ తెలిపారు.

News January 28, 2026

ఏడుపాయల జాతర ఎల్లలు దాటేలా నిర్వహించాలి: కలెక్టర్

image

ఏడుపాయల వనదుర్గా మాత జాతరను ఎల్లలు దాటేలా ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో భక్తులకు ఇబ్బందులు లేకుండా పార్కింగ్‌, తాగునీరు, విద్యుత్‌, పారిశుధ్యం, వైద్య సేవలు, క్యూలైన్లు, సీసీ కెమెరాలు, అగ్నిమాపక ఏర్పాట్లు చేయాలని సూచించారు. అధిక ధరలు, కల్తీ ఆహారం, మత్తు పదార్థాల విక్రయంపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.