News January 27, 2025

హైకోర్టులో ఈటల రాజేందర్ పిటిషన్

image

TG: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మేడ్చల్ జిల్లా పోచారంలో ఇటీవల తనపై నమోదైన FIRను కొట్టివేయాలని కోరారు. ఏకశిలానగర్‌లో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఈటల కొట్టారు. దీనిపై వాచ్‌మెన్ ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదైంది.

Similar News

News March 12, 2025

వచ్చే నెల అమరావతికి ప్రధాని మోదీ!

image

AP: రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో రాజధాని అమరావతి పనులను పున:ప్రారంభించనుంది. ఈ కార్యక్రమానికి రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించగా ఆయన అంగీకరించినట్లు సమాచారం. త్వరలో ప్రధాని కార్యాలయం అమరావతి పర్యటన తేదీని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, రాజధాని పనులను అట్టహాసంగా మళ్లీ స్టార్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 9ఏళ్ల కిందట అమరావతి పనులకు మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.

News March 12, 2025

ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్

image

AP: ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వేతన బకాయిలను మరో 2 రోజుల్లో విడుదల చేయనున్నట్లు వివరించింది. అలాగే, మెటీరియల్ నిధులతో చేపట్టిన పనుల పెండింగ్ బిల్లులనూ 10 రోజుల్లో చెల్లిస్తామంది. ఈ రెండింటికీ సంబంధించి రూ.2వేల కోట్ల బకాయిలు ఉండటంతో రాష్ట్ర ఉన్నతాధికారి ఢిల్లీ వెళ్లి కేంద్ర ఉన్నతాధికారులను కలిశారు. దీంతో సానుకూలంగా స్పందించిన వారు నిధులు విడుదల చేస్తామని చెప్పారు.

News March 12, 2025

పాత సెల్‌ఫోన్లు అమ్మేస్తున్నారా?

image

పాత సెల్‌ఫోన్లు కొని వాటితో సైబర్ నేరాలకు పాల్పడుతున్న బిహార్ ముఠాను ADB సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 2,125 సెల్‌ఫోన్లు, 107 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ‘చాలామంది పాత ఫోన్లలో సిమ్‌లు అలాగే ఉంచి అమ్మేస్తున్నారు. వాటితో నిందితులు సైబర్ నేరాలు చేస్తున్నారు. ఫలితంగా అమ్మినవారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పాత ఫోన్లు అమ్మే ముందు జాగ్రత్త పడండి’ అని పోలీసులు సూచించారు.

error: Content is protected !!