News January 27, 2025
కాశినాయన: గుండెపోటుతో మాజీ ఎంపీటీసీ భర్త మరణం

కాశినాయన మండలం వరికుంట్ల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ అల్లూరమ్మ భర్త చిన్న ఓబులేసు సోమవారం ఉదయం వరంగల్‌లో మరణించారు. వరంగల్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో కుర్చీలో కూర్చుని ఉండగా హార్ట్ అటాక్ వచ్చి మరణించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. తదనంతరం వరంగల్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఓబులేసు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News July 5, 2025
ఎర్రగుంట్ల: ‘RTPPలో విద్యుత్ ఉత్పత్తి తగ్గింపు’

రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (RTPP)లో విద్యుత్ ఉత్పత్తిని తగ్గించారు. ఇక్కడ పూర్తి ప్లాంట్ సామర్థ్యం 1650MW. వీటినుంచి ఏప్రిల్‌లో 839.98MU, మేలో 616.31MU, జూన్‌లో 729.28MU విద్యుత్ ఉత్పత్తి చేశారు. అయితే పూర్తి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేయలేదు. కేవలం 60% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్(PLF) మాత్రమే ఉపయోగిస్తున్నారు. RTPPలో 210X5MW, 600X1MW యూనిట్లు ఉన్నాయి.
News July 5, 2025
కడప: భార్యను హత్యచేసిన భర్త.. జీవిత ఖైదు

కడప తాలూకా PS పరిధిలోని ఏఎస్ఆర్ నగర్‌లో ఉండే ముద్దాయి మల్లికార్జునకు జీవిత ఖైదీతోపాటు రూ.లక్షా 60వేల జరిమానాను విదిస్తూ కడప ఏడవ ఏడిజే కోర్టు జడ్జి రమేశ్ శుక్రవారం తీర్పునిచ్చారు. కడపకు చెందిన యువతి గంగాదేవితో మల్లికార్జునకు 2012లో వివాహమైంది. అప్పటినుంచి ఆమెపై అనుమానంతో చంపేస్తానంటూ బెదిరించేవాడు. ఈ క్రమంలో 03/03/2019లో ఆమె గొంతు నులిమి హత్య చేసినందుకు గాను శిక్ష పడింది.
News July 5, 2025
కడప: పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్‌పై విచారణ

కడప పరిశ్రమల శాఖలో గతంలో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్‌గా పనిచేసిన కె.కృష్ణమూర్తిపై విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఆయనపై కొప్పర్తి పరిశ్రమల అధ్యక్షుడు జిల్లా కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదుపై కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఉషశ్రీని విచారణాధికారిగా, ఈశ్వరచంద్‌ను ప్రెజెంటింగ్ అధికారిగా నియమిస్తూ GO జారీ చేసింది.