News January 27, 2025
ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలి: మంత్రి గొట్టిపాటి

విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం అద్దంకిలో నీటి సంఘాల అధ్యక్షులు, ఎన్ఎస్పీ అధికారులతో సాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. రైతులను సమన్వయం చేసుకొని నియోజకవర్గంలో సాగర్ ఆయకట్టు భూములకు సాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. కాలువలు రిపేర్లు చేయిస్తామన్నారు. ఎన్ఎస్పీ ఎస్ఈ వరలక్ష్మి, ఈఈ రామకృష్ణ, సాగునీటి సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.
Similar News
News January 13, 2026
NMMS విద్యార్థులకు అలెర్ట్.. ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి

డిసెంబర్ 7న NMMS పరీక్ష రాసిన విద్యార్థులు కుల, ఆదాయ, 7వ తరగతి ధృవీకరణ పత్రాలను ఈ నెల 20లోపు సిద్ధం చేసుకోవాలని DEO వాసుదేవరావు మంగళవారం సూచించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వివరాలను www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. తల్లిదండ్రులు గడువులోగా ఈ పత్రాలను సిద్ధం చేసుకోవాలని కోరారు. నిర్లక్ష్యం చేస్తే స్కాలర్‌షిప్ పొందే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
News January 13, 2026
RJY: మహిళలపై వేధింపుల నివారణకు ప్రత్యేక బోర్డ్ కమిటీ

వరకట్న నిషేధ చట్టం-1961 అమలుపై అవగాహన పెంచాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ మేఘా స్వరూప్ సూచించారు. మంగళవారం రాజమండ్రి కలెక్టరేట్ వద్ద ఈ చట్టం అమలు, మహిళలపై వేధింపుల నివారణకు ప్రత్యేక బోర్డ్ కమిటీని ఏర్పాటు చేశారు. వరకట్న దురాచారంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం అవసరమని పేర్కొన్నారు. మహిళల రక్షణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
News January 13, 2026
కడప జిల్లాలో 99,508 హెక్టార్లలో రబీ పంటల సాగు

జిల్లాలో రబీ పంటల సాగు సాధారణ విస్తీర్ణం 1,39,796 హెక్టార్లు కాగా, ఈ ఏడాది
99,508 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. పప్పు సెనగ 68,207, మినుము 12,421, మొక్కజొన్న 5,390, వరి 4,223, జొన్న 2,110, కుసుమ 1.970, వేరుశనగ 1,259, గోధుమ 28, సజ్జ 783, రాగి 115, కొర్ర 81, కంది 143, పెసర 949, ప్రొద్దుతిరుగుడు 422, పత్తి 248 హెక్టార్లలో సాగయ్యింది. గత ఏడాది 1,10,776 హెక్టార్లలో సాగైనట్లు అధికారులు తెలిపారు.


