News January 27, 2025
వరకట్న నిషేధం, గృహహింస చట్టాల దుర్వినియోగం పిల్ తిరస్కరణ

వరకట్న నిషేధం, గృహహింస చట్టాల దుర్వినియోగాన్ని అడ్డుకొనేలా సంస్కరణలు కోరుతూ వేసిన పిల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇందులో కోర్టులు జోక్యం చేసుకోలేవని, పార్లమెంటుకే ఆ అధికారం ఉందని జస్టిస్ BV నాగరత్న, జస్టిస్ SC శర్మ బెంచ్ అభిప్రాయపడింది. ఇప్పటికే కోర్టులపై కేసుల భారం పెరిగిందని, కొత్తగా ఇలాంటివి వద్దని సూచించింది. లాయర్లు ఈ కేసుల్లో లిటిగెంట్స్ కావొద్దని పిటిషనర్ విశాల్‌ను ఆదేశించింది.
Similar News
News February 18, 2026
ఆయుష్ మంత్రిత్వశాఖలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

న్యూఢిల్లీలోని <
News February 18, 2026
ఫాల్గుణ మాసంలో ఇలా చేయండి: పండితులు

మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన మాసం ఫాల్గుణం. ఈ నెలలో లక్ష్మీనారాయణులను భక్తితో కొలిస్తే శుభాలు కలుగుతాయని పండితుల మాట. ‘చంద్రుడు ఫల్గుణి నక్షత్రం సమీపంలో ఉండటం వల్ల దీనికి ఆ పేరొచ్చింది. అర్జునుడికి ‘ఫల్గుణుడు’ అనే పేరుండటం మరో ప్రత్యేకత. దానధర్మాలు చేయడం, పవిత్ర నదులలో స్నానమాచరించడం వల్ల పుణ్యం లభిస్తుంది. ప్రకృతి వసంతానికి సిద్ధమయ్యే ఈ కాలంలో ఆధ్యాత్మిక చింతనతో గడపడం ఉత్తమం’ అంటున్నారు.
News February 18, 2026
మిరప మొక్కల వేర్లపై బొడిపెలకు కారణమేంటి?

మిరప పంటకు నులి పురుగులు ఆశించడం వల్ల మొక్కల వేర్లపై బొడిపెలు ఏర్పడతాయి. దీని వల్ల పంటకు నష్టం వాటిల్లుతుంది. ఈ నులి పురుగుల నివారణకు ఎకరాకు 100 కిలోల వేప పిండిని చల్లి, మట్టిలో కలిసే విధంగా నీరు పెట్టాలి. ఈ పురుగులు ఆశించిన పొలంలో వంగ, టమాటా, బంగాళాదుంపలను సాగు చేయకూడదు. ఆవాలు, నువ్వులు, మొక్కజొన్న, చిరుధాన్యాలతో పంట మార్పిడి చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


