News January 27, 2025

వరంగల్ మార్కెట్‌లో అరుదైన మిర్చి

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు నేడు వివిధ రకాల అరుదైన మిర్చి ఉత్పత్తులు తరలివచ్చాయి. 1048 రకం మిర్చి రూ.12వేలు పలకగా.. డబ్బి బ్యాగడి మిర్చి రూ.13వేలు పలికింది. అలాగే నం.5 మిర్చి ధర రూ.13,000, పాత తేజా మిర్చి ధర రూ.12,000, పాత వండర్ హాట్ మిర్చి రూ.12వేలు, 5531 మిర్చి రూ.12వేలు, 2043 మిర్చి రూ.14వేలు ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు.

Similar News

News November 7, 2025

వనపర్తిలో నవంబర్ 10న అప్రెంటీషిప్ మేళా

image

వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో నవంబర్ 10న అప్రెంటిషిప్ మేళా ఉంటుందని కళాశాల ప్రిన్సిపల్ కే.రమేష్ బాబు తెలిపారు. ఐటీఐ పాస్ అయిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభ్యర్ధులు అప్రెంటిస్ షిప్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ మేళాకు ధ్రువీకరణ పత్రాలతో రావాలన్నారు. వివరాలకు ట్రైనింగ్ ఆఫీసర్ ఎంఈ హక్‌ను లేదా సెల్ నంబర్లను 9849244030, 9490202037 సంప్రదించాలన్నారు.

News November 7, 2025

డికాక్ సూపర్ సెంచరీ.. ఒంటి చేత్తో గెలిపించాడు

image

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పాక్‌తో జరిగిన రెండో వన్డేలో SA బ్యాటర్ క్వింటన్ డికాక్ శతకంతో చెలరేగారు. 270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొటీస్ ప్లేయర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. డికాక్ 119 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సుల సాయంతో 123* పరుగులు చేశారు. టోనీ(76), ప్రిటోరియస్(46) రాణించారు. కేవలం 40.1 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ రీచ్ అయ్యారు. దీంతో 1-1తో సిరీస్‌ను సమం చేశారు.

News November 7, 2025

NZB: 38.15 లక్షలు తీసుకొని మోసగించిన మహిళ అరెస్ట్

image

నిజామాబాద్‌లో డబ్బుల పేరుతో ప్రజలను మోసగించిన మహిళను అరెస్టు చేసినట్లు సౌత్ సీఐ సురేష్ తెలిపారు. ఇటీవల మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదుగురి వద్ద 3 ఎకరాల భూమి ఇస్తానని నమ్మించి వారి నుంచి రూ.38.15 లక్షలు తీసుకొని మోసం చేసింది. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు స్వర్ణ ప్రమీలను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. ఆమె నుంచి బాధితుల చెక్కులు, ప్రాంసరీ నోట్లు, స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు.