News January 27, 2025
పదోన్నతులతో పాటు బాధ్యత పెరుగుతుంది: ASF SP

పదోన్నతులతో బాధ్యత పెరుగుతుందని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ముగ్గురు ఏఎస్ఐలుగా పదోన్నతులు పొందారు. వారిని ఎస్పీ అభినందించారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కి వచ్చే ప్రజలతో మర్యాదగా నడుచుకోవాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
Similar News
News January 18, 2026
USAలో నవీన్ హవా.. $1M+ కలెక్షన్స్‌లో హ్యాట్రిక్

‘అనగనగా ఒక రాజు(AOR)’ చిత్రంతో టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నారు. USAలో నవీన్ హవా ఎలా ఉంటుందో ఈ చిత్రంతో మరోసారి రుజువైంది. AOR సినిమా ఇప్పటికే అమెరికాలో $1M+ గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు నిర్మాణ సంస్థ పేర్కొంది. జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రాలు ఈ మార్కును దాటేయగా.. తాజాగా మూడో చిత్రంతో నవీన్ పొలిశెట్టి హ్యాట్రిక్ కొట్టేశారు.
News January 18, 2026
చలికాలం తలనొప్పా? ఈ టిప్స్‌తో ఉపశమనం పొందండి

రోజుకు కనీసం 2-3 లీటర్ల నీరు తాగాలి. అల్లం/పుదీనా వేసిన వేడి హెర్బల్ టీ తాగితే శరీరానికి వెచ్చదనం లభిస్తుంది. తల, మెడకు చలిగాలి తగలకుండా దుస్తులు ధరించాలి. మెడ, భుజం కండరాల్లో రక్తప్రసరణ మెరుగుపడేలా చిన్నపాటి వ్యాయామాలు చేయాలి. ఇంట్లో హీటర్లు, బ్లోయర్ల కంటే హ్యుమిడిఫయర్ వాడితే మంచిది. వాల్‌నట్స్, పాలకూరను ఫుడ్‌లో భాగం చేసుకోవాలి. పసుపులోని ‘కర్కుమిన్’ నేచురల్ పెయిన్ కిల్లర్‌లా పనిచేస్తుంది.
News January 18, 2026
ట్రంప్ టారిఫ్స్‌ను ఖండిస్తున్న యూరప్ దేశాలు

గ్రీన్‌లాండ్ డీల్‌ను వ్యతిరేకించిన దేశాలపై ట్రంప్ <<18885220>>టారిఫ్స్<<>> విధించడాన్ని యూరప్ దేశాలు ఖండిస్తున్నాయి. మిత్ర దేశాలపై ట్రంప్ టారిఫ్స్ విధించడం సరైంది కాదని UK PM కీర్ స్టార్మర్ పేర్కొన్నారు. టారిఫ్స్‌తో బెదిరింపులకు దిగడం ఆమోదయోగ్యం కాదని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తెలిపారు. తామెప్పుడూ తమ, పొరుగు దేశాల శ్రేయస్సు కోసం తప్పకుండా నిలబడతామని స్వీడన్ PM క్రిస్టెర్సన్ స్పష్టం చేశారు.


