News January 27, 2025
ప్రతి అర్జీకి సంపూర్ణ పరిష్కారం చూపండి: కలెక్టర్

నరసరావుపేట కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరించాలని కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలోని దూర ప్రాంతాల నుంచి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని నమ్మకంతో కలెక్టరేట్ వరకు దరఖాస్తుదారులు వస్తారన్నారు. రెవిన్యూతో పాటు ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలకు నాణ్యమైన పరిష్కారాన్ని ఇవ్వాలని, రీ వెరిఫికేషన్‌కు రాకుండా చూడాలన్నారు.
Similar News
News January 16, 2026
జగద్గిరిగుట్టలో దారుణ హత్య

జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి శ్రీరామ్‌నగర్‌లో నిన్న సాయంత్రం దారుణ హత్య జరిగింది. సొంత మరదలిని (17) సుత్తితో కొట్టి బావ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు అనంతపూర్ జిల్లా వాసి పవన్ కుమార్ (25)గా గుర్తించారు. హత్యకు గల వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు జగద్గిరిగుట్ట పోలీసులు వెల్లడించారు.
News January 16, 2026
ఎల్ఐసీ బిల్డింగ్ సమీపంలో వాహనం ఢీకొని వ్యక్తి మృతి

ఆర్టీసీ కాంప్లెక్స్, ఎల్ఐసీ బిల్డింగ్ మధ్యలో ఉన్న బస్టాప్ వద్ద శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి వయసు 75 సంవత్సరాలు దాటి ఉంటుందని ట్రాఫిక్ ఎస్ఐ సింహాచలం తెలిపారు. వైట్ షర్ట్ ధరించి ఉన్నాడన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని.. సీసీ ఫుటేజ్‌లు పరిశీలించి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News January 16, 2026
KNR: కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు

కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి క్యాంప్ కార్యాలయంలో గురువారం సంక్రాంతి పండుగను సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. పల్లె సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి వేడుకలు ఉత్సాహంగా సాగాయి. ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణాన్ని రంగురంగుల ముగ్గులతో అలంకరించగా, సిబ్బంది పండుగ వాతావరణంలో పాల్గొన్నారు.


