News January 27, 2025

ఆస్పత్రుల్లో సేవలపై 35% మంది అసంతృప్తి: CM

image

AP: రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీపై 90% మంది సంతృప్తిగా ఉన్నారని CM చంద్రబాబు తెలిపారు. ధాన్యం సేకరణలో 89.92% మంది రైతులు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. దేవాలయాల్లో దర్శనాలపై 70% మంది సంతృప్తి, వసతులపై 37% మందిలో అసంతృప్తి నెలకొందని తెలిపారు. ఆస్పత్రుల్లో సేవలపై 35% మంది అసంతృప్తి, అవినీతిపై 37% ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రభుత్వ పథకాల అమలుపై IVRS, వివిధ రూపాల్లో CM ప్రజాభిప్రాయం సేకరించారు.

Similar News

News December 28, 2025

చలి మంట.. పసిపిల్లలు మృతి

image

చలి కాచుకోవడానికి గదిలో బొగ్గుల కుంపటి పెట్టుకుని నిద్రించిన నలుగురు ఊపిరాడక చనిపోయిన ఘటన బిహార్‌లోని ఛాప్రాలో జరిగింది. మృతుల్లో ముగ్గురు పసిపిల్లలు, ఒక వృద్ధురాలు ఉన్నారు. గది తలుపులన్నీ మూసి ఉండటంతో బొగ్గుల నుంచి వచ్చిన కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ గదిని నింపేసింది. దీంతో ఆ గాలి పీల్చి వారు స్పృహ కోల్పోయి ప్రాణాలు విడిచినట్లు డాక్టర్లు తేల్చారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

News December 28, 2025

ప్రెగ్నెన్సీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

image

ప్రెగ్నెన్సీలో మహిళలు తరచుగా నీరసంగా, అలసిపోయినట్లు కనిపిస్తారు. అయితే ఈ లక్షణాలు ఎక్కువకాలం కొనసాగడం మంచిది కాదందటున్నారు నిపుణులు. అలసట, తలతిరగడం, కండరాల నొప్పి, బలహీనత, చేతులు, కాళ్ళలో జలదరింపు వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఈ సమస్యలను తగ్గించడానికి గుడ్లు, పాల ఉత్పత్తులు, చేపలు, మాంసం, గింజలు, రేగుపండ్లు తినాలని చెబుతున్నారు.

News December 28, 2025

మరో అడ్వెంచర్.. సబ్‌మెరైన్‌లో ప్రయాణించనున్న రాష్ట్రపతి

image

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మరో అడ్వెంచర్‌కు సిద్ధమవుతున్నారు. కర్ణాటకలోని కార్వార్ హార్బర్ నుంచి రేపు సబ్‌మెరైన్‌లో ప్రయాణించనున్నారు. ఏపీజే అబ్దుల్ కలాం తర్వాత జలాంతర్గామిలో వెళ్లనున్న రెండో రాష్ట్రపతిగా ముర్ము నిలవనున్నారు. 2006లో విశాఖపట్నం నుంచి సబ్‌మెరైన్‌లో కలాం ప్రయాణించారు. కాగా గత అక్టోబర్‌లో <<18139196>>రఫేల్ జెట్‌<<>>లో, 2023లో Sukhoi 30 MKI యుద్ధ విమానంలో ముర్ము విహరించడం తెలిసిందే.