News January 27, 2025
పార్వతీపురం: గ్రీవెన్స్ ద్వారా 105 వినతులు స్వీకరణ

పార్వతీపురం కల్టెరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. వచ్చిన వినతులను ఎప్పటికప్పుడు పరిశీలించి, ఆ సమస్య పరిష్కార దిశగా కృషిచేయాలని అన్నారు. అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని తెలిపారు. కార్యక్రమంలో ప్రజల నుంచి 105 వినతులను స్వీకరించారు.
Similar News
News January 8, 2026
అనంతపురం కోర్టుకు బాంబు బెదిరింపు

అనంతపురం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రత దృష్ట్యా లాయర్లు, సిబ్బందిని వెలుపలికి పంపారు. డీఎస్పీ శ్రీనివాసులు నాయకత్వంలో బాంబు స్క్వాడ్, క్లూస్ టీమ్ కోర్టు ప్రాంగణంలో సుదీర్ఘ తనిఖీలు చేపట్టాయి. ప్రతి గదిని క్షుణ్ణంగా పరిశీలించారు. చివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
News January 8, 2026
భారీ జీతంతో నీతిఆయోగ్‌లో ఉద్యోగాలు

<
News January 8, 2026
కాచిగూడలో హిందూ- ముస్లిం లవ్ మ్యారేజ్

నగరంలో అంతర్మత వివాహం చట్టబద్ధంగా నమోదైంది. హిందూ–ముస్లిం యువతి యువకుల మధ్య జరిగిన ఈ వివాహాన్ని కాచిగూడ PSలో అధికారికంగా రిజిస్ట్రేషన్ చేశారు. మేజర్ల సమ్మతితో, అన్ని చట్టపరమైన నిబంధనలు పాటిస్తూ వివాహ ప్రక్రియ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసు భద్రత ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.


