News March 18, 2024

కోవూరులో 62 ఏళ్ల రికార్డ్ బ్రేక్ అవుతుందా?

image

నెల్లూరు జిల్లాలోని కోవూరు అసెంబ్లీ స్థానానికి 1962 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు. అత్యధికంగా నల్లపరెడ్డి కుటుంబ సభ్యులే ఇక్కడ గెలిచారు. తాజా ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, వైసీపీ అభ్యర్థిగా ప్రసన్న కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు. ప్రశాంతి రెడ్డి 62 ఏళ్ల రికార్డును బద్దలు కొడుతుందేమో చూడాలి మరి..

Similar News

News February 5, 2026

నెల్లూరు: రైతులే స్వయంగా.. యాప్‌లో పంట నమోదు

image

APAIMS 2.0 యాప్‌ని ప్రభుత్వం తీసుకోచ్చింది. దీని ద్వారా రైతులే స్వయంగా తమ పంట వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఈ యాప్‌ను మొబైల్‌లోని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఆధార్ నెంబర్‌తో రిజిస్టర్ అయి MPINను లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. రైతు తమ పొలం వద్దకు వెళ్లి ఫోటో దిగి నమోదు చేసుకోవచ్చని ఆశాఖ కోవూరు AD అనిత Way2Newsకి తెలిపారు. విడవలూరులో రైతుల ద్వారా ఈ ప్రయత్నాన్ని ఆత్మ PD శారద, AO లక్ష్మి చేపట్టారు.

News February 5, 2026

నెల్లూరు: ఆన్‌లైన్‌లో మహిళ పరిచయం.. రూ.30 లక్షలు స్వాహా!

image

నెల్లూరు వెంకటరెడ్డి నగర్‌కు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి వాట్సాప్, టెలిగ్రామ్‌లో శివాని అనే మహిళ పరిచయం ఏర్పడింది. ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించడంతో ఆ ఉద్యోగి మహిళ సూచించిన బ్యాంక్ ఖాతాలకు రూ.29.8 లక్షలు నగదు జమచేశాడు. తన అవసరం నిమిత్తం పెట్టుబడులు ఉపసంహారించుకునేందుకు ప్రయత్నించగా నగదు రాలేదు. దీంతో బాధితుడు వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

News February 5, 2026

నెల్లూరు: ‘రాకాసి’పుండు కబలిస్తోంది..!

image

నెల్లూరు జిల్లాలో క్యాన్సర్(రాకాసి పుండు) మహమ్మారి ప్రజల జీవితాలను కాలరాస్తోంది. IRCS క్యాన్సర్ ఆసుపత్రికి రేడియేషన్ థెరఫీకి 2023లో 291, 2024లో 3697, 2025లో 2441 మంది వచ్చారు. జిల్లాలోని PHCల ద్వారా OCT-2025 నుంచి GGHకు 364 కేసులు రెఫరల్‌గా రాగా.. 32 మందిలో వ్యాధి నిర్ధారణ అయినట్లు NCD అధికారులు తెలిపారు. మారిన ఆహారపు అలవాట్లు, చెడు వ్యసనాలు, కాలుష్యం వంటివి క్యాన్సర్ వచ్చేందుకు కారణాలుగా ఉన్నాయి.