News January 27, 2025

విశాఖ: 8 పర్యాటక ప్రాజెక్టులకు ఎంవోయూలు

image

విశాఖపట్టణంలో జరిగిన రీజినల్ ఇన్వెస్టర్స్ టూరిజం సమ్మిట్ వేదికగా రూ.1,217 కోట్ల విలువైన 8 పర్యాటక ప్రాజెక్టుల ఎంవోయూపై పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సంతకాలు చేశారు. సోమవారం విశాఖలో ఓ హోటల్‌లో జరిగిన ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు 150కి పైగా పెట్టుబడిదారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలో 825 ప్రాజెక్టుల ఏర్పాటుకు ఇన్వెస్టర్లు ముందుకొచ్చారు.

Similar News

News January 11, 2026

విశాఖ- పార్వతీపురం మధ్య ప్రత్యేక MEMU రైలు

image

సంక్రాంతికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖ-పార్వతీపురం మధ్య MEMU స్పెషల్ రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. (08565/08566) రైలు ఈనెల 14-18 వరకు విశాఖలో ఉ.10కి బయలుదేరి మ.12.20కి పార్వతీపురం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో పార్వతీపురంలో మ.12.45కి బయలుదేరి సా.4 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఈ రైలుకి సింహాచలం, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, బొబ్బిలి, తదితర స్టేషన్లలో హాల్ట్ కలదు.

News January 11, 2026

విశాఖ పోలీసులను అభినందించిన జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా

image

విశాఖలో మహిళపై దాడి కేసులో స్పష్టమైన ఆధారాలు లేకున్నా పోలీసులు కేసు ఛేదించారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఈ ఘటనలో పోలీసులు స్పందించిన తీరు, వేగవంతమైన దర్యాప్తు అభినందనీయమని ఆయన కొనియాడారు. కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయనేందుకు ఇదే నిదర్శనమన్నారు. మహిళల రక్షణలో దేశంలోనే విశాఖకు మొదటి స్థానం కూటమి ఘనతే అన్నారు.

News January 11, 2026

విశాఖ జూ పార్క్‌లో ముగిసిన వింటర్ క్యాంప్

image

విశాఖ జూ పార్క్‌లో 4 రోజుల నుంచి జరుగుతున్న వింటర్ క్యాంప్ ఆదివారంతో ముగిసింది. జనవరి 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఈ క్యాంప్ నిర్వహించిన్నట్లు క్యూరేటర్ మంగమ్మ తెలిపారు. వింటర్ క్యాంప్‌తో వన్యప్రాణుల ప్రపంచాన్ని పిల్లలకు పరిచయం చేశారు. ముఖ్యంగా జూ పార్కులో వెటర్నరీ హాస్పిటల్, జంతువుల నివాసాలు, వాటి ఆహారపు అలవాట్లు, వాటి ప్రత్యేక లక్షణాలపై అవగాహన కల్పించారు.