News January 27, 2025

SKLM: 28 నుంచి దివ్యాంగులకు ఉపకరణాల గుర్తింపు శిబిరాలు

image

దివ్యాంగులకు సహాయ ఉపకరణాల డివిజన్ స్థాయి గుర్తింపు శిబిరాలు ఈ నెల 28 నుండి 30 వరకు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు కవిత తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 28న శ్రీకాకుళం జిల్లా పరిషత్ లోను, 29న టెక్కలి తహశీల్దార్ కార్యాలయంలోను, 30న పలాస ఎంపీడీఓ కార్యాలయంలో ఉంటుందని వివరించారు. అర్హులను గుర్తించి ఉపకరణాల పంపిణీ చేస్తామన్నారు.

Similar News

News November 11, 2025

SKLM: పిల్లలు దత్తత కావాలా.. ఐతే ఇలా చేయండి

image

అర్హులైన తల్లిదండ్రులు మిషన్ వాత్సల్య వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుంటే పిల్లలను చట్టబద్ధంగా దత్తత ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. సోమవారం ఆయన కార్యాలయంలో దత్తత ప్రక్రియపై కరపత్రాన్ని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిని విమల ఆధ్వర్యంలో సోమవారం విడుదల చేశారు. www.missionvataslya.wcd.gov.in వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేయాలన్నారు.

News November 10, 2025

SKLM: ‘బిల్లుల చెల్లింపు, భూసేకరణ పరిష్కరించాలి’

image

వంశధార ప్రాజెక్ట్ పనుల్లో జాప్యాన్ని సహించేది లేదని, పెండింగ్‌లో ఉన్న పనులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. వంశధార ప్రాజెక్ట్ పురోగతిపై సోమవారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన కీలక ప్యాకేజీల క్రింద పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.18.09 కోట్ల విలువైన బిల్లుల చెల్లింపును వేగవంతం చేయాలన్నారు.

News November 10, 2025

శ్రీకాకుళం కలెక్టర్ గ్రీవెన్స్‌కు 102 అర్జీలు

image

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్‌కు జిల్లా నలుమూలల నుంచి 102 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ స్వప్నిల్ దిన్‌కర్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. అందులో రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్, విద్యుత్తు సంస్థ వంటి పలు శాఖలకు దరఖాస్తులు అందాయన్నారు. త్వరగతిన అర్జీలు పూర్తి చేయాలని అధికారులను సూచించారు.