News January 27, 2025

జనగామ: ప్రజావాణి ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించరాదు: కలెక్టర్

image

ప్రజావాణి ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించరాదని జిల్లా క‌లెక్ట‌ర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారుల‌ను ఆదేశించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు పింకేశ్ కుమార్, రోహిత్ సింగ్‌లతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకున్న వారి అర్జీలను పరిశీలించి, వెంటనే పరిష్కరించాలన్నారు.

Similar News

News November 9, 2025

ఏలూరు జిల్లాలో పోలీసుల తనిఖీలు

image

ఏలూరు జిల్లాలోని జాతీయ రహదారులపై శనివారం రాత్రి పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రమాదాల నివారణలో భాగంగా హెవీ వాహన డ్రైవర్లకు ‘ఫేస్ వాష్’ కార్యక్రమం నిర్వహించారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్‌లతో పరీక్షలు నిర్వహించారు. రాత్రివేళల్లో లాడ్జీలు, బస్సు, రైల్వే స్టేషన్లలో కొత్త వ్యక్తుల వివరాలను ఆరా తీసి, అనుమానాస్పదంగా ఉన్న వారిని ప్రశ్నించారు.

News November 9, 2025

జెమీమా, షెఫాలీ.. భారీగా పెరిగిన బ్రాండ్ వాల్యూ

image

ఉమెన్స్ ODIWC విజయం తర్వాత జెమీమా, షెఫాలీ బ్రాండ్ వాల్యూ 2-3 రెట్లు పెరిగినట్లు కార్పొరేట్ వర్గాలు చెబుతున్నాయి. ‘జెమీమా ₹60 లక్షల నుంచి ₹1.5 కోట్లు, షెఫాలీ ₹40 లక్షల నుంచి ₹కోటి కేటగిరీకి చేరారు. మిగతా ప్లేయర్లకూ 25-55% పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. లైఫ్ స్టైల్, బ్యూటీ, పర్సనల్ కేర్, విద్యాసంస్థలు, ఆటోమొబైల్, బ్యాంకులు వారితో ప్రచారం చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి’ అని పేర్కొన్నాయి.

News November 9, 2025

ప్రకాశం బ్యారేజ్‌ వద్ద వరద అప్టేట్

image

ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం ఉదయం ఇన్‌ఫ్లో 68,623 క్యూసెక్కులు ఉండగా దిగువకు 60,150 క్యూసెక్కులు, కేఈ మెయిన్ ద్వారా 3,238 క్యూసెక్కులు, కేడబ్ల్యు మెయిన్ 5,009 క్యూసెక్కులు, గుంటూరు ఛానెల్ ద్వారా 226 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నీటిమట్టం 12 అడుగులకు చేరినట్లు అధికారులు తెలిపారు.