News January 27, 2025
కేసులను త్వరితగతిన పూర్తి చేయాలి: ఎస్పీ అమిత్ బర్దార్

పెండింగ్‌లోని కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేసి కోర్టులో సమర్పించాలని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఆదేశించారు. సోమవారం పాడేరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన నెలవారీ నేర సమీక్షా నిర్వహించారు. పెండింగ్‌లోని కేసుల గురించి తెలుసుకుని NBW వెంటనే అమలు చేయాలన్నారు. గంజాయి కేసుల్లో తప్పించుకుని తిరుగుతున్న నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని ఆదేశించారు.
Similar News
News July 6, 2025
NGKL: జిల్లా విద్యుత్ ఎస్ఈ సీహెచ్ పౌల్ రాజ్ బదిలీ

నాగర్‌కర్నూల్ జిల్లా విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తూ వచ్చిన సీహెచ్ పౌల్ రాజ్‌ను బదిలీ చేస్తూ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను కార్పొరేట్ కార్యాలయానికి బదిలీ చేశారు. ఆయన ఇక్కడ దాదాపు ఏడాది పాటు ఎస్ఈగా విధులు నిర్వహించారు. ఆయన స్థానంలో మరో అధికారిని నియమించాల్సి ఉంది.
News July 6, 2025
కరీమాబాద్‌లో కనుల పండువగా బీరన్న బోనాలు

తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కురుమల కుల దైవం బీరన్న బోనాల కనుల పండువగా జరిగాయి. కరీమాబాద్, ఉర్సులోని కురుమ కుల మహిళలు భక్తితో బొనమెత్తారు. బీరప్ప సంప్రదాయంగా గావు పట్టగా బోనాలు బీరన్న గుడికి చేరుకున్నాయి. స్వామి వారికి నైవేద్యం సమర్పించిన తిరుగుముఖం పట్టారు. మంత్రి సురేఖ, మేయర్ సుధారాణి, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
News July 6, 2025
గిరి ప్రదక్షిణ: పార్కింగ్ ప్రదేశాలివే-2

➣అడవివరం నుంచి గిరిప్రదక్షిణ నిమిత్తం తొలిపావంచకు వచ్చే వారు వాహనాలను అడవివరం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో పెట్టి కాలినడకన రావి చెట్టు జంక్షన్ నుంచి గాంధీనగర్, కోనేరు మీదుగా కలశం జంక్షన్ చేరుకోవాలి
➣ వేపగుంట, గోపాలపట్నం నుంచి వచ్చే భక్తులు సింహపురి కాలనీ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాలైన RTC స్థలం, GVMC పార్క్, VMRDA స్థలాల్లో వాహనాలు నిలపాలి.