News January 27, 2025
నారాయణపేటలో క్వింటా వేరుశనగ ధర ఎంతంటే?

నారాయణపేట వ్యవసాయ మార్కెట్కు సోమవారం భారీగా వేరుశనగకాయ తరలి వచ్చింది.1551 క్వింటాళ్ల వేరుశనగ రాగా.. గరిష్ఠంగా రూ.5,775.. కనిష్ఠంగా రూ.3,020 ధర పలికింది. సోనారకం వరి ధాన్యం 9 క్వింటాళ్లు రాగా.. గరిష్ఠంగా రూ.1,939.. కనిష్ఠంగా రూ.1,939 ధర పలికింది. 50,69 క్వింటాళ్ల ఎర్ర రకం కందులు రాగా.. గరిష్ఠంగా రూ.7,549 కనిష్ఠంగా రూ.3,200 వరకు పలికినట్లు వ్యవసాయ మార్కెట్ అధికారి లక్ష్మణ్ తెలిపారు.
Similar News
News March 14, 2025
రాయపర్తి: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన వెంకన్న (38) చేపల వేటకు వెళ్లి నీట మునిగి మృతి చెందాడు. ఎస్సై శ్రవణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ మత్స్యకారులతో కలిసి వెంకన్న గురువారం సాయంత్రం తాళ్లకుంటలోకి చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో వల కాళ్లకు చుట్టుకుని నీట మునిగి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రవణ్ కుమార్ వివరించారు.
News March 14, 2025
మీరు గొప్పవారు సర్..

TG: సిద్దిపేట జిల్లాకు చెందిన 80 ఏళ్ల రిటైర్డ్ టీచర్ బాల్ రెడ్డిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 1970 నుంచి 2004 వరకు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైరైనా పాఠాలు చెప్పడం మానట్లేదు. ఇంట్లో ఖాళీగా ఉండటం ఇష్టం లేక ప్రజ్ఞాపూర్, తిమ్మక్కపల్లి, క్యాసారం ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లిష్ బోధిస్తున్నారు. రోజూ 15 KM సొంతడబ్బుతో ప్రయాణిస్తూ ఒక్క రూపాయి తీసుకోకుండా విద్యాదానం చేస్తున్నారు.
News March 14, 2025
మెదక్: చిరుత పులి దాడిలో లేగ దూడలు మృతి..?

మెదక్ జిల్లాలో చిరుత పులి సంచారం ఆందోళన కలిగిస్తోంది. రామాయంపేట మండలం దంతేపల్లి శివారులోని నక్కిర్తి స్వామి పొలం వద్ద పశువుల పాకపై అర్ధరాత్రి అడవి జంతువు దాడి చేసి రెండు దూడలను చంపేసింది. అయితే చిరుత దాడితోనే దూడలు మృత్యువాత పడ్డాయని బాధితులు పేర్కొన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. అయితే దాడి చేసింది ఏ జంతువు అనేది తెలియాల్సి ఉంది.