News January 27, 2025

సత్యసాయి: పంటకాలువలో పసికందు మృతదేహం

image

బుక్కపట్నం మండల కేంద్రంలోని రామస్వామి గుడి సమీపంలో సోమవారం ఉదయం వ్యవసాయ కాలువలో నెలలు నిండని చిన్నారి మృతదేహం కలకలం రేపింది. నీళ్లలో కొట్టుకుంటూ వెళ్తున్న విషయాన్ని గమనించిన స్థానికులు పంచాయతీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు చిన్నారి మృతదేహాన్ని బయటకు తీసి పూడ్చేసినట్లు సమాచారం.

Similar News

News September 16, 2025

క్రమంగా తగ్గుతున్న నిరుద్యోగ రేటు

image

దేశంలో 15 ఏళ్లు, అంతకన్న ఎక్కువ వయసుండి పనిచేసే అవకాశం ఉన్న వ్యక్తుల్లో నిరుద్యోగ రేటు క్రమంగా తగ్గుతోంది. కేంద్రం విడుదల చేసిన కార్మిక సర్వే గణాంకాల ప్రకారం.. ఆగస్టులో నిరుద్యోగ రేటు 5.1%గా నమోదైంది. ఇది జులైలో 5.2 శాతంగా, మే, జూన్ నెలల్లో 5.6 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ రేటు వరసగా మూడో నెలలో కూడా తగ్గింది. మేలో 5.1% ఉన్న రేటు ఆగస్టులో 4.3 శాతానికి తగ్గింది.

News September 16, 2025

జిల్లాలో ఏడు మండలాల ఎంపీడీవోలు బదిలీలు

image

నెల్లూరు జిల్లాలోని 7 మండలాల్లో ఎంపీడీవోలు బదిలీ చేస్తూ జిల్లా ప్రజా పరిషత్ సీఈవో జే మోహన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ఉదయగిరి శ్రీనివాసులు, దుత్తలూరు చెంచమ్మ, నెల్లూరు రూరల్ ఎంవీ రవణమ్మ, చేజర్ల ఎలిషా బాబు, సైదాపురం ఎంవీ రామ్మోహన్ రెడ్డి, కలువాయి ఏ శైలజ, వరికుంటపాడు డీవీ రమణారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

News September 16, 2025

బందీలను వదిలేయండి.. హమాస్‌కు ట్రంప్ వార్నింగ్

image

హమాస్ నాయకులను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ‘ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కొనేందుకు బందీలను మానవ కవచాలుగా వాడేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. హమాస్ నేతలు ఏం చేస్తున్నారో వారికి అర్థమవుతోందా? ఇది మహా దారుణం. అతి తక్కువ మంది అలాంటివి చూసుంటారు. అలా జరగకుండా ఆపండి. లేదంటే అన్నీ ఒప్పందాలు రద్దవుతాయి. బందీలను వెంటనే విడుదల చేయండి’ అని వార్నింగ్ ఇచ్చారు.