News January 27, 2025
GWL: పోలీస్ ప్రజావాణిలో 7 ఫిర్యాదులు: SP

గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 7 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. భూ వివాదాలకు సంబంధించి 4, ప్లాటు ఆక్రమణకు సంబంధించి 1, ఇతర అంశాలకు సంబంధించి 2 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత ఎస్సైలకు సూచించారు. ప్రజావాణి ద్వారా బాధితులకు న్యాయం చేసేందుకు జిల్లా పోలీస్ శాఖ కృషి చేస్తుందని చెప్పారు.
Similar News
News March 14, 2025
సీఎం ఒక్కరే నిర్ణయాలు తీసుకోరు: మంత్రి పొన్నం

TG: తమ ప్రభుత్వంలో ఏ నిర్ణయమైనా CM ఒక్కరే తీసుకోరని, అంతా కలిసి నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అసెంబ్లీ నుంచి జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేయడంపై BRS నిరసనకు దిగడం సిగ్గుచేటని అన్నారు. ‘తాము అనుకున్నట్లుగా సభ నడవాలనేది BRS నేతల ఉద్దేశం. అందుకే దుష్ప్రచారాలు చేస్తున్నారు. స్పీకర్గా దళితుడు ఉన్నారనే అవమానించారు. పొరపాటు అయ్యిందని చెబితే వివాదం ముగిసేది’ అని వ్యాఖ్యానించారు.
News March 14, 2025
మెదక్: పండగ పూట విషాదం.. యువకుడి ఆత్మహత్య

పెళ్లి సంబంధాలు కుదరడంలేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. చిన్నశంకరంపేట మండలం మడూరుకు చెందిన ఫిరంగళ్ల శివరాజ్(24) గురువారం రాత్రి పొలానికి నీళ్లు చూడడానికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో శివరాజు తండ్రి యాదగిరి పొలం వద్దకు వెళ్లి చూడగా వేప చెట్టుకు ఉరివేసుకొని కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసుల విచారణ చేపట్టారు.
News March 14, 2025
దోమ: ఒకే ఈతలో రెండు దూడలు..

ఒకే ఈతలో రెండు లేగ దూడలు జన్మించిన ఘటన వికారాబాద్ జిల్లా దోమ మండలం దోర్నాలపల్లి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వెంకన్న ఒక ఆవు ఉంది. ఆ ఆవుకు ఒక లేగ దూడను జన్మనివ్వగా మరి కొద్దిసేపటి తర్వాత మరో లేగ దూడకు జన్మనిచ్చిందని వెంకన్న తెలిపారు. తన ఆవుకు రెండు లేగ దూడలు జన్మించడంపై ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. రెండు దూడలు కూడా ఆరోగ్యంగా ఉన్నాయని మాజీ సర్పంచ్ వెంకన్న తెలిపారు.