News March 18, 2024
రేపు ‘కంగువ’ టీజర్

శివ డైరెక్షన్‌లో సూర్య నటిస్తోన్న పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘కంగువ’ టీజర్‌ను రేపు సా.4.30 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రూ.350 కోట్ల బడ్జెట్‌తో 10 భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన హీరో ఫస్ట్ లుక్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. త్వరలోనే మూవీ ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
Similar News
News March 7, 2026
మాకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు: భారత్

రష్యా నుంచి ఆయిల్ కొనడానికి భారత్‌కు 30 రోజులు <<19308509>>అనుమతిస్తున్నట్లు<<>> అమెరికా చేసిన ప్రకటనపై కేంద్రం స్పందించింది. ‘హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు నెలకొన్నందున చౌకగా లభించే ఏ దేశం నుంచైనా ముడి చమురును కొనుగోలు చేస్తూనే ఉంటాం. దీనికి ఎవరి అనుమతీ అవసరం లేదు. మాకు జాతీయ ప్రయోజనాలే ముఖ్యం. మేం ముడి చమురు వనరుల లభ్యతను 27 నుంచి 40 దేశాలకు విస్తరించాం’ అని ఓ ప్రకటన విడుదల చేసింది.
News March 7, 2026
650 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఒక్కరోజే ఛాన్స్

RBIలో 650 అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికే రేపే చివరి తేదీ. 50% మార్కులతో డిగ్రీ పాసై, స్థానిక భాషలో ప్రావీణ్యం ఉన్న వారు అర్హులు. వయోపరిమితి 20-28 ఏళ్లు. రిజర్వేషన్ బట్టి సడలింపు ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.29,000-రూ.78,640 చెల్లిస్తారు.
వెబ్‌సైట్: https://rbi.org.in./
News March 7, 2026
అమెరికాకు షాక్.. కీలక వ్యవస్థను ధ్వంసం చేసిన ఇరాన్!

అమెరికాకు ఇరాన్ షాకిచ్చింది. గల్ఫ్‌లో క్షిపణి రక్షణ వ్యవస్థలకు కీలకమైన రాడార్ సిస్టమ్‌ను దెబ్బతీసింది. <<14350576>>థాడ్(THAAD)<<>>లో ఉపయోగించే రాడార్ పరికరాలను ధ్వంసం చేసింది. జోర్డాన్‌లోని మువాఫాక్ సాల్టి వైమానిక స్థావరంలో ఉన్న ఈ రాడార్ సిస్టమ్‌పై యుద్ధం ప్రారంభంలోనే దాడి జరిగిందని అమెరికా అధికారులు ధ్రువీకరించారు. ఈ సిస్టమ్ విలువ $300M(₹2,760Cr) పైనే. ప్రపంచంలో USకు 8 థాడ్ వ్యవస్థలున్నాయి.


