News January 27, 2025
బాడీ బిల్డింగ్ పోటీలో తాండూరు వాసికి గోల్డ్ మెడల్

బాడీ బిల్డింగ్ పోటీలో తాండూరు పూజారి కుమారుడు సత్తా చాటాడు. తాండూరు మున్సిపల్ పరిధిలోని పాత తాండూరు కోటేశ్వర స్వామి దేవాలయం పూజారి చంద్రశేఖర్ స్వామి కుమారుడు అభిషేక్ స్వామి ఇటీవల రాష్ట్రస్థాయిలో జరిగిన బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. 55 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్, మ్యాన్ ఫిజిక్ విభాగంలో కాంస్య పతకం సాధించాడు. ఈ మేరకు డాక్టర్ సమత్ కుమార్ అభినందించారు.
Similar News
News September 17, 2025
వ్యవసాయ కూలీ టీచర్ ఉద్యోగానికి ఎంపిక

వ్యవసాయ పనులు చేస్తూ తల్లిదండ్రులకు తోడుగా ఉంటూ మెగా డీఎస్సీలో రేపల్లెకు చెందిన వ్యవసాయ కూలీ 15వ ర్యాంకు సాధించారు. రేపల్లెకు చెందిన సొంటి సురేష్ స్కూల్ అసిస్టెంట్ (సామాజిక శాస్త్రం) విభాగంలో 80.56 మార్కులతో 15వ ర్యాంకు సాధించి 2 పోస్టులకు ఎంపికయ్యారు. సురేష్ మాట్లాడుతూ.. వ్యవసాయం తనకు క్రమశిక్షణ నేర్పిందన్నారు. కష్టపడి చదివితే ఎవరికైనా విజయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
News September 17, 2025
నూజివీడు ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తులు

నూజివీడు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో వివిధ ట్రేడ్లలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రధానాధికారి రజిత తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 27 సాయంత్రం 5 గంటలలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్ దరఖాస్తు కాపీతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లను అదే రోజు లోగా వెరిఫికేషన్ చేయించుకోవాలని ఆమె పేర్కొన్నారు. ఇది విద్యార్థులకు మంచి అవకాశమని తెలిపారు.
News September 17, 2025
బద్వేల్: దొంగనోట్ల మార్పిడి.. ఐదుగురికి జైలు శిక్ష

దొంగ నోట్ల మార్పిడి కేసులో ఐదుగురు ముద్దాయిలకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ బద్వేలు జడ్జి పద్మశ్రీ మంగళవారం తీర్పునిచ్చారు. SI మహమ్మద్ రఫీ మాట్లాడుతూ.. సిద్దవటం మండలంలోని మాధవరం-1లోని ఓ వైన్ షాపులో 2010లో కర్నూలు జిల్లా బనగానపల్లెకు చెందిన మాధవరెడ్డి, షర్ఫుద్దీన్, వెంకటేశ్వర్లు, అల్తాఫ్, హుస్సేన్ వలిలు వెయ్యి రూపాయల దొంగ నోటు చలామణి చేయగా కేసు నమోదైంది.