News January 27, 2025
రష్మిక సినిమాపై వివాదం.. సీఎం ఏమన్నారంటే?

విక్కీ కౌశల్, రష్మిక జంటగా నటించిన ‘ఛావా’ సినిమాపై <<15278801>>వివాదం నేపథ్యంలో<<>> మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ స్పందించారు. ఛత్రపతి శివాజీ చరిత్రను కరెక్ట్‌గా చూపించాలని, దాన్ని వక్రీకరించడం సరికాదని స్పష్టం చేశారు. శంభాజీపై అందరికీ ఎంతో ప్రేమ, గౌరవం ఉందన్నారు. సినిమాల్లో క్రియేటివిటీ, సెన్సిటివిటీల మధ్య సమతుల్యత ఉండాలని పేర్కొన్నారు. కాగా మూవీలో వివాదాస్పదమైన డాన్స్ సీన్‌ను తొలగిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Similar News
News November 9, 2025
గ్రూప్-3.. రేపటి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్

TG: 1,388 గ్రూప్-3 ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ రేపటి నుంచి ఈ నెల 26 వరకు కొనసాగనుంది. నాంపల్లిలోని తెలుగు వర్సిటీలో రోజూ 10.30AM నుంచి 1.30PM, తిరిగి 2PM నుంచి 5.30PM వరకు పరిశీలన జరగనుంది. విద్యార్హత సర్టిఫికెట్లు, హాల్‌టికెట్, ఆధార్/ఏదైనా ప్రభుత్వ ఐడీ, అప్లికేషన్ ఫామ్ తదితర పత్రాలను తీసుకెళ్లాలి. పూర్తి వివరాలకు https://www.tgpsc.gov.in/ సంప్రదించవచ్చు.
News November 9, 2025
విధ్వంసం.. 13 బంతుల్లో 54 రన్స్

హాంకాంగ్ సిక్సెస్-2025లో ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. తాజాగా సౌతాఫ్రికాతో మ్యాచులో బంగ్లా ఓపెనర్ హబీబుర్ రెహ్మాన్ ఊచకోత కోశారు. 13 బంతుల్లోనే 54 రన్స్ చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగారు. ఆయన ఏకంగా 8 సిక్సర్లు, ఒక ఫోర్ బాదారు. అంటే బౌండరీల ద్వారానే 52 రన్స్ రాబట్టారు. మరో ప్లేయర్ హొస్సైన్ 8 బంతుల్లో 27 రన్స్ చేయడంతో BAN 6 ఓవర్లలో 128 పరుగులు చేసింది. SA 25 రన్స్ తేడాతో ఓడిపోయింది.
News November 9, 2025
ఒలింపిక్స్ 2028: IND vs PAK మ్యాచ్ లేనట్లే!

2028 నుంచి ఒలింపిక్స్‌లో క్రికెట్ భాగం కానున్న సంగతి తెలిసిందే. అయితే మెగా టోర్నీలు అనగానే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఉండాల్సిందే. కానీ ఈ ఈవెంట్‌లో ఇరు జట్లు తలపడే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌కు ఒలింపిక్స్‌లో చోటు దక్కడం కష్టంగా మారడమే దీనికి కారణం. ఒక్కో ఖండం నుంచి ఒక్కో <<18233382>>జట్టును<<>> ఎంపిక చేయాలని ఐసీసీ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.


