News January 27, 2025

BREAKING: కొండపాకలో యాక్సిడెంట్.. సెక్యూరిటీ గార్డ్ మృతి

image

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం రాంపల్లి శివారులో సోమవారం బైక్‌ను వ్యాన్ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి చనిపోయాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. రాంపల్లి గ్రామానికి చెందిన నరేందర్ రెడ్డి(35) స్థానిక టోల్ ప్లాజాలో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడు. విధులు ముగించుకుని గ్రామానికి బైక్‌పై రాంపల్లి శివారులో వ్యాన్ ఢీకొట్టింది. తీవ్రగాయలై అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

Similar News

News July 6, 2025

‘లక్కీ భాస్కర్’కు సీక్వెల్ ఉంది: డైరెక్టర్

image

వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటించిన ‘లక్కీ భాస్కర్’ సినిమా సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ వెంకీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ధనుష్‌తో తాను తీసిన ‘సార్’ సినిమాకు మాత్రం సీక్వెల్ లేదని తెలిపారు. గత ఏడాది OCTలో విడుదలైన ‘లక్కీ భాస్కర్’ ₹100crకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం వెంకీ తమిళ హీరో సూర్యతో ఓ మూవీని తెరకెక్కిస్తున్నారు.

News July 6, 2025

వరల్డ్‌లో HYD బిర్యానీ ది BEST!

image

HYD బిర్యానీ.. ఈ పేరు ఒక ఎమోషన్. దీని రుచి వరల్డ్ ఫేమస్‌. సిటీలో దమ్ బిర్యానీ‌ తింటే ఫిదా అవ్వాల్సిందే. మాంసానికి మసాలా అంటించి, పెరుగు, నెయ్యి, నిమ్మకాయ రసం బాగా పట్టిస్తారు. బాస్మతి రైస్‌తో మాంసాన్ని ఉడికించి బిర్యానీ రెడీ చేస్తారు. ఫైనల్‌గా కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయలు ఈ వంటకానికి మరింత రుచినిస్తాయి. ఇన్ని మిశ్రమాలతో చేసే HYD బిర్యానీ వరల్డ్ బెస్ట్‌గా నిలవడం విశేషం.

నేడు World Biryani Day

News July 6, 2025

సంగారెడ్డి జిల్లాలో ఎంపీడీఓల బదిలీలు

image

సంగారెడ్డి జిల్లా ఎంపీడీఓ సుధాకర్, మాల్సుర్ ఇతర జిల్లాలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఇతర జిల్లాలో పని చేస్తున్న చంద్రశేఖర్, మంజుల, శారద దేవీ జిల్లాకు రానున్నట్లు పేర్కొన్నారు. బదిలీ అయిన ఎంపీడీఓలు తక్షణమే విధుల్లో చేరాలని సూచించారు.