News January 27, 2025
CM రేవంత్ రెడ్డికి మెదక్ రైతు THANKS

మెదక్ జిల్లా రామాయంపేట మండలం దామరచెరువు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు భరోసా డబ్బులు బ్యాంకులో పడడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన దేవసత్ బద్యానాయక్ అనే రైతుకు రూ.7 వేలు అకౌంట్లో జమ కావడంతో సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో దామలచెరువులో రైతు భరోసా డబ్బులు జమ చేసినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News October 29, 2025
వనపర్తి: మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలి- కలెక్టర్

మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రతి మండలం నుండి స్వయం సహాయక సభ్యులకు కనీసం ఒక యూనిట్ నెలకొల్పే విధంగా ఏ.పీ.యం.లు బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. అలాగే జిల్లాలోని జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్లు కట్టుకోవడానికి మహిళా సంఘాల ద్వారా రుణాలు మంజూరు చేయించాలన్నారు. ఎక్కడైనా బ్యాంకర్లతో సమస్యలు ఉంటే సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.
News October 29, 2025
NRPT: నవంబర్ 3న డయల్ యువర్ ఎస్పీ

నవంబర్ 3న డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ బుధవారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రజల నుంచి సమస్యలు తెలుసుకునేందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు 0850 6281182 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు తెలియజేయాలని అన్నారు. ప్రజలు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News October 29, 2025
చిత్తూరు: అంగన్వాడీల్లో CDPO తనిఖీలు

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో అంగన్వాడీలను తెరవలేదని Way2Newsలో <<18139694>>వార్త <<>>వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై సీడీపీవో అరుణశ్రీ స్పందించారు. మండలంలోని అంగన్వాడీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందు మూడు రోజులు సెలవులు అని చెప్పి.. ఇవాళ తిరిగి ఓపెన్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారన్నారు. ఈక్రమంలో కాస్త ఆలస్యంగా సెంటర్లను ఓపెన్ చేశారని సీడీపీవో చెప్పారు. అన్ని సెంటర్లలో సిబ్బంది పనితీరు బాగుందన్నారు.


