News January 27, 2025

పద్మనాభం: ఉరి వేసుకుని మహిళ, యువకుడు మృతి

image

పద్మనాభ (మం) కృష్ణాపురంలో ఓ మహిళ, యువకుడు మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. వివాహిత మహిళ లక్ష్మి(31), మోకర ఆదిత్య(21) గ్రామంలో వేర్వేరు చోట్ల ఉరి వేసుకుని మృతి చెందినట్లు గుర్తించారు. వారి బంధువుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పద్మనాభం సీఐ శ్రీధర్ తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Similar News

News April 16, 2026

విశాఖ-భవానిపట్న రైలు రీషెడ్యూల్

image

విశాఖపట్నం-భవానిపట్న ప్యాసింజర్ రైలు (58504) రీషెడ్యూల్ అయినట్లు సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు. గురువారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు ఆలస్యంగా రావడంతో రాత్రి 7 గంటలకు విశాఖ నుంచి కదులుతుంది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి రైల్వే శాఖ విచారం వ్యక్తం చేసింది. ఈ మార్పును గమనించాలని అధికారులు సూచించారు.

News April 16, 2026

విశాఖ-లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రీషెడ్యూల్

image

విశాఖపట్నం-లోకమాన్య తిలక్ టెర్మినస్ (18519) ఎక్స్‌ప్రెస్ రైలు రీషెడ్యూల్ అయినట్లు సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు. లింక్ రైలు ఆలస్యంగా రావడం వల్ల ఏప్రిల్ 16 రాత్రి 11:20 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు, ఏప్రిల్ 16 అర్ధరాత్రి 12:30 గంటలకు విశాఖ నుంచి బయలుదేరుతుంది. ప్రయాణికులు ఈ మార్పును గమనించి సహకరించాలని అధికారులు కోరారు.

News April 16, 2026

సింహాచలంలో రేపు ఆర్జిత సేవలు బంద్

image

సింహాచలంలో శుక్రవారం ఆర్జిత సేవలు నిలిపివేసినట్లు దేవస్థానం ఈవో వెంకట్రావు తెలిపారు. శుక్రవారం గంధం అమావాస్య సందర్భంగా.. గురువారం సాయంత్రం నుంచే పుష్కరణి దగ్గర స్నానాలు చేసి శుక్రవారం ఉదయం నుంచి భక్తుల రద్దీ భారీగా ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో అన్ని సేవలు రద్దు చేసినట్లు ఆయన తెలిపారు.