News January 27, 2025
రంజీ జట్టు ప్రకటించిన ఢిల్లీ.. కోహ్లీకి చోటు

రంజీ ట్రోఫీలో భాగంగా రైల్వేస్‌తో ఆడే మ్యాచ్‌కు ఢిల్లీ జట్టును ప్రకటించింది. భారత స్టార్ బ్యాటర్ కోహ్లీ ఎంపిక కాగా, పంత్‌కు చోటు దక్కలేదు. 13ఏళ్ల తర్వాత విరాట్ రంజీ ఆడనున్నారు. JAN 30నుంచి మ్యాచ్ జరగనుంది.
జట్టు: బదోని, కోహ్లీ, ప్రణవ్, సాంగ్వాన్, అర్పిత్, మయాంక్, శివమ్, సుమిత్, వాన్ష్, మనీ, హర్ష్ త్యాగి, సిద్ధాంత్, సైనీ, యశ్ ధుల్, గగన్, జాంటీ సిద్ధు, హిమ్మత్, వైభవ్, ఆర్. గెహ్లోత్, జితేశ్ సింగ్.
Similar News
News January 28, 2026
OTTలోకి కొత్త సినిమా.. 2 వారాల్లోనే!

తమిళ హీరో కార్తి, కృతి శెట్టి జంటగా నటించిన ‘వా వాతియార్’ (తెలుగులో ‘అన్నగారు వస్తారు’) సినిమా OTTలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ నెల 14న థియేటర్లలో విడుదలైన తమిళ వెర్షన్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ఇతర భాషల్లో రిలీజ్ చేయకుండా 2 వారాల్లోనే నేరుగా OTTలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ మూవీకి నలన్ కుమారస్వామి డైరెక్టర్.
News January 28, 2026
త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్: మంత్రి సవిత

AP: త్వరలో DSC నోటిఫికేషన్ విడుదల కానుందని మంత్రి సవిత తెలిపారు. BC స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో BC అభ్యర్థులకు ఉచిత శిక్షణిస్తామని, జిల్లాల వారీగా కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. విజయవాడ గొల్లపూడిలో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలోని సివిల్స్ కోచింగ్ సెంటర్‌ను ఆమె సందర్శించారు. గతేడాది మాదిరిగా ఈ ఏడాది కూడా 100 మంది BC అభ్యర్థులకు ఉచిత సివిల్స్ కోచింగ్ అందజేస్తున్నట్లు తెలిపారు.
News January 28, 2026
ఫ్యాన్ వార్స్ వల్ల సినిమాలకు నష్టం లేదు: అనిల్ రావిపూడి

సినిమా రిజల్ట్‌పై ఫ్యాన్ వార్స్ ప్రభావం ఏమాత్రం ఉండదని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. ఓ హీరో మూవీ రిలీజ్ అయినప్పుడు ఇతర హీరోల అభిమానులు నెగటివ్ ప్రచారం చేయడంపై ఆయన ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘ఏం చేసినా ఫ్యాన్ వార్స్ ఆగవు. కానీ వాటి వల్ల సినిమాకి వచ్చే రెవెన్యూలో అర్ధ రూపాయి కూడా తగ్గదు’ అని అభిప్రాయపడ్డారు. మూవీ బాగుంటే ఫ్యాన్స్‌తో పాటు జనరల్ ఆడియన్స్ ఆదరిస్తారని పేర్కొన్నారు.


