News January 27, 2025

ప్రజా ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి  అధికారులను ఆదేశించారు. మండల, డివిజన్, మున్సిపల్ స్థాయిలో జరిగిన పీజీఆర్ఎస్ మినిట్స్ సీఎంవో పీజీఆర్ఎస్ గ్రూపులో నోడల్ అధికారికి పోస్ట్ చేయాలన్నారు. రీ సర్వే గ్రామసభలు, రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన దరఖాస్తులను వెబ్ పోర్టల్‌లో అప్లోడ్ చేసి, నిర్ణీత వ్యవధిలోగా పరిష్కరించడంతో పాటు ఆడిట్ చేయాలన్నారు.

Similar News

News October 19, 2025

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రీచ్ కానీ టార్గెట్..!

image

ఉమ్మడి KNR జిల్లాలో 2025-27కు గాను వైన్ షాప్ టెండర్ల ద్వారా రూ.380 కోట్ల ఆదాయం రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు 287 వైన్ షాపులకు గాను 7188 దరఖాస్తుల ద్వారా రూ.215.64 కోట్ల ఆదాయం వచ్చింది. క్రితంసారి 10,734 దరఖాస్తులకు గాను 214.68 కోట్ల ఆదాయం రాగా.. ఈసారి 3,546 దరఖాస్తులు తక్కువగా వచ్చినా రూ.కోటి 4 లక్షల ఆదాయం పెరిగింది. ఈనెల 23లోపు టార్గెట్ రీచ్ అవుతోందో, కాదో వేచి చూడాలి.

News October 19, 2025

డ్యూడ్‌ మూవీకి కళ్లుచెదిరే కలెక్షన్స్

image

ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు కాంబోలో వచ్చిన డ్యూడ్ మూవీ బాక్సాఫీస్ వద్ద కళ్లుచెదిరే కలెక్షన్స్ రాబడుతోంది. ఈనెల 17న విడుదలైన ఈ చిత్రం రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. తొలిరోజు రూ.22 కోట్లు కొల్లగొట్టిన ‘డ్యూడ్’ రెండో రోజు అంతకుమించి రూ.23 కోట్లు రాబట్టింది. చిన్న హీరో మూవీకి ఈ రేంజ్‌లో కలెక్షన్స్ రావడం విశేషం.

News October 19, 2025

నారాయణపేట: టీఆర్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా శివవీరరెడ్డి

image

తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులైన తీన్మార్ మల్లన్న నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన శివ వీర రెడ్డికు తెలంగాణ రాష్ట్ర రాజ్యాధికార పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా వాసి శివ వీర రెడ్డికి TRP రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.