News January 27, 2025
రేపు డయల్ యువర్ వనపర్తి డీఎం ప్రోగ్రాం

వనపర్తి డిపోలో రేపు డయల్ యువర్ డీఎం ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు వనపర్తి ఆర్టీసీ డిపో మేనేజర్ వి. వేణుగోపాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్టీసీ సేవలను ప్రయాణికులకు మరింత చేరువ చేసేందుకు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు ప్రజల నుంచి సూచనలు సలహాలు ఫిర్యాదులను స్వీకరిస్తున్నామని తెలిపారు.7382826289 కు ఫోన్ చేసి సూచనలు ఇవ్వాలని కోరారు.
Similar News
News January 13, 2026
ప్రభుత్వం పనితీరుపై చిత్తూరు ప్రజల స్పందన ఇదే..!

ప్రభుత్వ సేవలు అందడంలో చిత్తూరు జిల్లాలో 66% మందే సంతృప్తి వ్యక్తం చేశారని సీఎం చంద్రబాబు తెలిపారు. వెలగపూడిలో నిర్వహించిన సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. పింఛన్ల పంపిణీపై 85.4, అన్న క్యాంటీన్లపై 84.4, దీపం పథకంపై 66.2, ఆర్టీసీ బస్సులపై 70.9, వైద్య సేవలపై 62.4, రిజిస్ట్రేషన్ సేవలపై 64.2, హౌసింగ్ పథకంపై 52.9, రెవెన్యూ సేవలపై 45.5, రెవెన్యూ సర్వేపై 45.1 శాతం సంతృప్తి ఉందని వివరించారు.
News January 13, 2026
మెదక్: కౌన్సిలర్ అభ్యర్థుల్లో రిజర్వేషన్ టెన్షన్

మున్సిపల్ ఎన్నికల నగారా త్వరలో మోగనుండటంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఓటరు జాబితా విడుదల కావడంతో ఇప్పుడు అందరి దృష్టి రిజర్వేషన్లపైనే ఉంది. తమ వార్డు ఏ వర్గానికి కేటాయిస్తారోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు టికెట్ల కోసం పైరవీలు ముమ్మరం చేస్తూనే, వార్డుల్లో ప్రచారం మొదలుపెట్టారు. రిజర్వేషన్లు ఖరారైతేనే పోటీపై స్పష్టత రానుంది.
News January 13, 2026
నిజామాబాద్: వారికి కలెక్టర్ హెచ్చరిక

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణికి డుమ్మా కొట్టిన అధికారులపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నాటి కార్యక్రమానికి గైర్హాజరైన వారికి మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. మొదటి తప్పుగా భావించి మెమోలిస్తున్నామని, పునరావృతమైతే వేతనాల్లో కోతతో పాటు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి అధికారులు బాధ్యతగా పనిచేయాలని స్పష్టం చేశారు.


