News March 18, 2024
డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలి: ఎమ్మెల్సీ లక్ష్మణరావు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి ముఖేశ్ కుమార్ మీనాను సచివాలయంలో సోమవారం కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు కలిసారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు జరిగే డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయించాలని వినతి పత్రం అందించారు. అభ్యర్థులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని తగ్గించాలని ప్రిపరేషన్‌కు తగిన సమయం ఉండేలా చూడాలని కోరారు.
Similar News
News February 9, 2026
మచిలీపట్నంలో ‘వందేమాతరం’ కోస్టల్ సైక్లోథాన్ ప్రారంభం

మచిలీపట్నంలోని కోనేరు సెంటర్లో CISF ఆధ్వర్యంలో సోమవారం ‘వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్-2026’ మెగా సైకిల్ ర్యాలీ ఘనంగా ప్రారంభమైంది. దేశ రక్షణ, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పిస్తూ సుమారు 6,500 కి.మీ మేర సాగే ఈ భారీ యాత్రను అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. తీర ప్రాంత భద్రతలో ప్రజలను భాగస్వామ్యం చేయడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశం.
News February 9, 2026
కృష్ణా: పీజీఆర్ఎస్‌కు 152 అర్జీలు

కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో 152 అర్జీలు వచ్చాయి. కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి అందిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు పరిష్కార చర్యల నిమిత్తం బదిలీ చేశారు. పంచాయతీ రాజ్‌కు సంబంధించి అధిక అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు.
News February 9, 2026
బందరు పోర్టుకు ‘షిప్ బిల్డింగ్’ కళ.. ఎంపీ బాలశౌరి హర్షం

మచిలీపట్నం పోర్టులో నౌకల నిర్మాణం, మరమ్మతుల సౌకర్యాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడంపై ఎంపీ వల్లభనేని బాలశౌరి సంతోషం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం బందరు పోర్టు రూపురేఖలను మార్చివేస్తుందని, దీనివల్ల పోర్టుకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు జీవో విడుదల చేసిన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


