News January 28, 2025
ఉమ్మడి MBNR జిల్లాలో నేటి..TOP NEWS!!

✔వనపర్తి:ఎస్సీ హాస్టల్‌లో విద్యార్థి మృతి
✔అచ్చంపేట: విద్యుదాఘాతానికి గురై రైతు దుర్మరణం
✔అయిజ:”Way2news ఎఫెక్ట్” ఓపెన్ డ్రైనేజీ శుభ్రం
✔ప్రజావాణి.. సమస్యలపై ప్రత్యేకంగా నిఘా
✔నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన
✔అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు:ఎస్సైలు
✔పలుచోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
✔సీఎం,MLAల చిత్రపటాలకు పాలాభిషేకం
✔సన్నధాన్యం బోనస్ బకాయిలు చెల్లించాలి:రైతులు
Similar News
News July 6, 2025
జగిత్యాల: మాజీ మంత్రి జీవన్ రెడ్డి హెచ్చరిక

జగిత్యాల జిల్లాలో మత్స్యకార సంఘాలకు రావాల్సిన వేట హక్కులను కాంట్రాక్టర్లకు అప్పగించడాన్ని మాజీమంత్రి జీవన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు పశుసంవర్ధక శాఖ మంత్రులకు లేఖ రాసిన ఆయన, ప్రభుత్వం తీసుకుంటున్న టెండర్ విధానం మత్స్యకారులను అణగదొక్కేలా ఉందన్నారు. వేట హక్కులు స్థానిక సంఘాలకే ఇవ్వాలని, లేకపోతే జగిత్యాల జిల్లా వ్యాప్తంగ ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. మత్స్యకారుల జీవనాధారాన్ని కాపాడాలన్నారు.
News July 6, 2025
రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: ములుగు కలెక్టర్

ములుగు కలెక్టరేట్‌లో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. సోమవారం జిల్లాలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క పర్యటన నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేశామన్నారు. వచ్చే సోమవారం యధావిధిగా ప్రజావాణి కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
News July 6, 2025
అనకాపల్లి: ‘ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు చేయ్యోచ్చు’

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి రాలేని వారు ఆన్‌లైన్‌లో ఫిర్యాదులను నమోదు చేయవచ్చని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదివారం పేర్కొన్నారు. సమస్యలపై meekosam.ap.gov.in వెబ్ సైట్‌లో ఫిర్యాదు చేయడానికి అవకాశం కల్పించామన్నారు. వారి సమస్యల పరిష్కార స్థితిని 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని సూచించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు.