News January 28, 2025
గుండ్లకమ్మను నిర్వీర్యం చేశారు: గొట్టిపాటి

గడిచిన ఐదేళ్ల కాలంలో సాగునీటి వ్యవస్థను జగన్ మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణను పూర్తిగా గాలికి వదిలేశారని ఆరోపించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టును నిర్వీర్యం చేయడమే కాకుండా గేట్లు విరగొట్టి ఇసుక దోపిడీకి పాల్పడిన చరిత్ర జగన్ ప్రభుత్వానిదే అని ధ్వజమెత్తారు.
Similar News
News September 17, 2025
ఒత్తైన జుట్టుకు బియ్యం నీళ్లు

ప్రస్తుత కాలంలో జుట్టు రాలే సమస్య పెరిగింది. అయితే హెయిర్‌లాస్ ఎక్కువ ఉంటే బియ్యం కడిగిన నీళ్లతో చెక్ పెట్టొచ్చు. బియ్యం నీటితో మర్దనా చేసుకుంటే మాడు ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే అమినో ఆమ్లాలు, విటమిన్ బీ, ఈ, సీలు జుట్టు పెరగడానికి సహకరిస్తాయి. అలాగే రాత్రి బియ్యం నానబెట్టిన నీటిని వడకట్టి ఉదయాన్నే తలకు పట్టించి అరగంట తర్వాత కడుక్కోవాలి. ఇలా వారానికోసారి చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
News September 17, 2025
NGKL: తెలంగాణ సాయుధ పోరాటంలో అప్పంపల్లి కీలకం

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో MBNR జిల్లాలోని అప్పంపల్లి గ్రామం కీలక పాత్ర పోషించింది. ఈ గ్రామం నుంచి 11 మంది పోరాటంలో పాల్గొని అమరులయ్యారు. పోరాటంలో చాకలి కిష్టన్నను నిజాం పాలకులు మొదట చంపినా, లింగోజిరావు వంటి వీరులు వెనుకడుగు వేయకుండా నిజాంకు వ్యతిరేకంగా పోరాడి, తెలంగాణ విలీనానికి కృషి చేశారని చరిత్ర చెబుతోంది.
News September 17, 2025
VKB: పోరాట యోధుడు దొండేరావ్ జాదవ్

వికారాబాద్ గాంధీ కాలనీకి చెందిన దొండేరావ్ జాదవ్ నిజాం పాలనలో ప్రజలపై జరుగుతున్న దౌర్జన్యాలను వ్యతిరేకించారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి 1947 SEP 17న అరెస్టయ్యారు. గుల్బర్గా జైలులో నిర్బంధం ఎదుర్కొన్నారు. 1948లో సర్దార్ పటేల్ సైనిక చర్యతో TG భారతదేశంలో విలీనమైంది. ఆయన విడుదలయ్యారు. త్యాగానికి గుర్తుగా ప్రభుత్వం తామ్రపత్రం ప్రదానం చేసింది. వికారాబాద్‌లో శిలాఫలకం ఏర్పాటు చేసింది.