News March 18, 2024

CM జగన్, మంత్రుల ఫొటోలు తొలగించాలని SECకి అచ్చెన్న లేఖ

image

AP: 23 ప్రభుత్వ వెబ్‌సైట్లలో CM జగన్, మంత్రుల ఫొటోలు తొలగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి TDP రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ‘ఈ నెల 16వ తేదీ మ.3 గంటల నుంచి కోడ్ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రభుత్వ వెబ్‌సైట్లలో రాజకీయ పార్టీలకు చెందిన వారి ఫొటోలు ఉండరాదు. కానీ ప్రభుత్వ వెబ్‌సైట్లలో ఇంకా సీఎం, మంత్రుల చిత్రాలు ఉన్నాయి. వెంటనే వాటిని తొలగించాలి’ అని లేఖలో పేర్కొన్నారు.

Similar News

News September 30, 2024

తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

image

TG: బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైడ్రాపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందంటూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్‌ వద్దకు చేరుకున్నాయి. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి పరస్పరం దాడి చేసుకున్నాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెస్తున్నారు.

News September 30, 2024

VIRAL: 1985 నాటి రెస్టారెంట్ బిల్

image

ఫ్యామిలీ అంతా కలిసి రెస్టారెంట్‌ డిన్నర్‌కి వెళ్తే రూ.వేలల్లో ఖర్చవడం పక్కా. కానీ, రూ.26తో ముగ్గురు పుష్టిగా తినొచ్చు. ఏంటీ షాక్ అయ్యారా? 40 ఏళ్ల క్రితం ఇది సాధ్యమే మరి. 1985 నాటి రెస్టారెంట్ బిల్లు ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. షాహీ పనీర్ రూ.8, దాల్ మఖానీ రూ.5కే సర్వ్ చేశారు. పాత రోజులే బెటర్ అని, సరసమైన ధరలకే మంచి ఆహారం లభించేదని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు.

News September 30, 2024

‘ఎమ‌ర్జెన్సీ’ సెన్సార్ క‌ట్‌కు అంగీక‌రించిన కంగ‌న‌

image

నటి, బీజేపీ ఎంపీ కంగ‌నా ర‌నౌత్ న‌టించిన ఎమ‌ర్జెన్సీ చిత్రం విడుద‌ల‌కు అడ్డంకులు తొల‌గ‌నున్నాయి. ఈ చిత్రం విడుద‌ల‌కు సంబంధించి తాము సూచించిన మార్పులు చేయ‌డానికి కంగ‌న అంగీక‌రించిన‌ట్టు బాంబే హైకోర్టుకు సెన్సార్ బోర్డు తెలిపింది. బోర్డు సూచించిన మార్పుల‌ను చిత్రంలో స‌ర్దుబాటు చేసే విష‌య‌మై చిత్రం కో-ప్రొడ్యూస‌ర్ జీ స్టూడియోస్ కొంత స‌మ‌యం కోర‌డంతో కోర్టు గురువారానికి కేసు వాయిదా వేసింది.