News January 28, 2025
స్టేట్ స్పోర్ట్స్ మీట్‌కు నిర్మల్ జిల్లా పోలీసులు

ఇటీవల అత్యుత్తమ ప్రతిభ కనబరిచి స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ మీటింగ్‌కు 16 మంది వివిధ విభాగాల్లో సెలెక్ట్ అయ్యారని జిల్లా ఎస్పీ జానకి షర్మిల సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కార్యాలయంలో వారిని అభినందించారు. స్టేట్ స్పోర్ట్స్ మీట్లో ప్రతిభ చాటి మెడల్స్ తీసుకురావాలని ఆకాంక్షించారు. ఆల్ ఇండియా లెవల్‌కు ఎంపిక కావాలని కోరారు.
Similar News
News November 5, 2025
ప్రతాపసింగారం: పంచవృక్షాల మహిమాన్వితం.. శైవక్షేత్రం

మేడ్చల్ జిల్లా ప్రతాపసింగారంలోని శివాలయం విశిష్టతతో భక్తుల మనసును ఆకట్టుకుంటోంది. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు నిర్మించిన ఈ దేవాలయంలో రావి, మారేడు, వేప, ఉసిరి, జమ్మి పంచవృక్షాలు ఒకేస్థలంలో పెరిగాయి. ఈ 5 వృక్షాలు సాక్షాత్ దైవతత్త్వాన్ని ధారపోస్తూ ఆ ప్రదేశాన్ని పవిత్ర శక్తిక్షేత్రంగా మార్చేశాయి. ఆధ్యాత్మిక తేజస్సు విరజిమ్మే ఈ ప్రాంగణంలో కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే శుభఫలాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.
News November 5, 2025
జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర దాడులకు కుట్ర?

జమ్మూకశ్మీర్‌లో దాడులకు లష్కరే తోయిబా, జైషే మహ్మద్ సంస్థలు ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. పాక్ SSG, ISI సాయంతో ఆయా సంస్థల టెర్రరిస్టులు దేశంలోకి చొరబడినట్లు అనుమానిస్తున్నాయి. టెర్రరిస్టు షంషేర్ ఆధ్వర్యంలోని టీమ్ డ్రోన్ల ద్వారా LoC గ్యాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చెక్ చేసిందని చెప్పాయి. క్రాస్ బార్డర్ అటాక్స్ చేసేందుకు పాక్ బార్డర్ యాక్షన్ టీమ్స్ సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించాయి.
News November 5, 2025
మేడారం: ‘ఛాలెంజ్‌గా పనులు పూర్తి చేయండి’

మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల ఆవరణలో జరుగుతున్న మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనులను ఆర్ అండ్ బి ఈఈ మోహన్ నాయక్ పరిశీలించారు. చేపట్టిన పనులను ఛాలెంజ్‌గా తీసుకుని సకాలంలో పూర్తి చేయాలని ఇంజనీర్లకు, కాంట్రాక్టర్లకు స్పష్టం చేశారు. పనుల్లో నాణ్యత పాటించాలన్నారు. ఈ నెల 10లోపు పిల్లర్స్, గ్రానైట్ పనులను తప్పక పూర్తి చేయాలని ఈఈ ఆదేశించారు.


