News January 28, 2025
సత్యసాయి జిల్లాలో ఫిర్యాదులకు 67 పిటిషన్లు

శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 67 దరఖాస్తులు వచ్చినట్టు ఎస్పీ కార్యాలయం ప్రకటనలో తెలిపింది. సోమవారం జిల్లా ఎస్పీ రత్న ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు తమ సమస్యలపై ఫిర్యాదులు చేశారు. వీటిని పరిశీలించిన ఎస్పీ రత్న సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు పంపి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
Similar News
News February 23, 2026
భయపడకండి.. ప్రభుత్వం అండగా ఉంది: మంత్రి దుర్గేశ్

రాజమండ్రిలో ప్రజలను కలవరపెడుతున్న అనూరియాపై మంత్రి కందుల దుర్గేశ్ తీవ్రంగా స్పందించారు. ఈ పరిస్థితిపై సోమవారం కలెక్టర్ కీర్తి చేకూరి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టిందని, ప్రజలు భయాందోళనలకు గురికావద్దని ఆయన భరోసా ఇచ్చారు.
News February 23, 2026
ఏలూరు: నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

ఏలూరు జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డీయల్‌టీసీ సహాయ సంచాలకుడు భూషణం తెలిపారు. ప్రధానమంత్రి కౌశల్ వికాశ్ యోజన కింద ఫీల్డ్ టెక్నీషియన్ కంప్యూటింగ్, పెరిఫెరల్స్ (కంప్యూటర్ హార్డ్వేర్) కోర్సులో 3 నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇంటర్ ఆపైన ఉత్తీర్ణులైన వారు 15-35 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. ఈనెల 28లోపు 9493482414 సంప్రదించాలన్నారు.
News February 23, 2026
తెలంగాణ ఉద్యమకారులకు గుడ్ న్యూస్

TG: తెలంగాణ సాధనలో పోరాడిన ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్లు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. తమకు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఉద్యమకారులు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. పిటిషనర్ల తరఫున లాయర్ కరుణాకర్ రెడ్డి వాదించారు. అభయహస్తం స్కీం కింద అప్లై చేసిన వీరికి 8వారాల్లో ఇళ్ల స్థలాలు, పెన్షన్లు ఇవ్వాలని న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్ రెడ్డి తీర్పు ఇచ్చారు.


