News January 28, 2025

స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ కమిషనర్‌గా కృష్ణారెడ్డి

image

నూతనంగా మున్సిపాలిటీగా ఏర్పడిన స్టేషన్ ఘనపూర్‌కు గ్రేటర్ వరంగల్ డిప్యూటీ కమిషనర్ ఎన్.కృష్ణారెడ్డి ఫుల్ అడిషనల్ ఇన్‌ఛార్జి మున్సిపల్ కమిషనర్‌గా మంగళవారం బాధ్యతలు చేపట్టనున్నారు. వరంగల్ ఆర్డీఎంఏ షాహిద్ మసూద్ స్పెషల్ ఆఫీసర్‌గా నియమించబడ్డారు. దీంతో ఇప్పటివరకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో జరిగిన పాలన మంగళవారం నుంచి మున్సిపల్ అధికారులతో పాలన కొనసాగనుంది.

Similar News

News January 11, 2026

KNR: మార్కెట్‌లో సంక్రాంతి ముగ్గుల రంగులకు గిరాకీ!

image

సంక్రాంతి పండుగ వేళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రంగుల విక్రయాలు జోరందుకున్నాయి. కొత్త డిజైన్ల కోసం మహిళలు ఆసక్తి చూపుతుండటంతో మార్కెట్లలో రంగులకు డిమాండ్ పెరిగింది. లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి, చెడును తొలగించడానికి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయడం ఆనవాయితీ. భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో గొబ్బెమ్మలతో అలంకరించిన ముగ్గులు సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తాయి.

News January 11, 2026

సంక్రాంతి సందడి.. హోటళ్లు హౌస్‌ఫుల్

image

AP: గోదావరి జిల్లాల్లో సందడి సంక్రాంతి మొదలైంది. భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, కాకినాడ, రాజమండ్రి వంటి ప్రాంతాల్లో హోటళ్లు, లాడ్జిలు హౌస్‌ఫుల్ అయిపోయాయి. కోడిపందేల కోసం తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి జనం తరలివస్తున్నారు. పందేల బరులు భారీగా ఏర్పాటు చేస్తున్నారు. హోటల్ యజమానులు గదుల అద్దెను మూడు రోజులకు రూ.30-60 వేలు వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

News January 11, 2026

తలనొప్పితో బాధపడుతున్నారా?

image

తరచూ తలనొప్పి వస్తుంటే దానికి ప్రధాన కారణం మన రోజువారీ అలవాట్లేేనని నిపుణులు అంటున్నారు. మార్నింగ్ టిఫిన్ దాటవేయడం, ఎక్కువసేపు ఆకలితో ఉండటం దీనికి ముఖ్య కారణాలు. అలాగే ఒత్తిడితో కూడిన జీవనశైలి వలన మెడ, తల కండరాలు బిగుసుకుపోయి నొప్పి వస్తుంది. తగినంత నీరు తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడి అకస్మాత్తుగా తలనొప్పి వస్తుంది. బరువు తగ్గాలనే ఉద్దేశంతో సరిగ్గా తినకపోయినా, నిద్ర లేకపోయినా ఈ సమస్య వస్తుంది.