News January 28, 2025

ప్రజా ఫిర్యాదులను నాణ్యతతో పరిష్కరించండి: కలెక్టర్

image

ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యతతో వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జీ.రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఇంకా 1,514 దరఖాస్తులను వ్యూ చేయలేదని, 40 రీఓపెన్ అయ్యాయని, 27 సీఎంవో దరఖాస్తులు రీఓపెన్ అయ్యాయని, తక్షణమే పరిష్కరించాలని అన్నారు.

Similar News

News November 9, 2025

ఎవరిది అగ్రికల్చరో.. ఎవరిది డ్రగ్స్ కల్చరో చూడండి: రేవంత్

image

TG: BRS పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని CM రేవంత్ మండిపడ్డారు. ‘ఒకప్పుడు డ్రగ్స్ అంటే ఎవరో పెద్దోళ్లు తీసుకుంటారనుకునేది. ఇప్పుడు గల్లీగల్లీకి విస్తరించారు. అందుకే ఎవరిది అగ్రికల్చరో.. ఎవరిది డ్రగ్స్ కల్చరో, ఎవరిది పబ్ కల్చరో.. ఎవరిది సామాన్యులతో కలిసిపోయే కల్చరో చూడండి. సినీ కార్మికులతో ఎవరు మాట్లాడుతున్నారో.. సినీ తారలతో ఫామ్‌హౌస్‌లో ఎవరు ఉంటున్నారో గుర్తు చేసుకోవాలి’ అని కోరారు.

News November 9, 2025

భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

ఈనెల 14,15వ తేదీల్లో జ‌ర‌గ‌నున్న ప్ర‌పంచస్థాయి భాగ‌స్వామ్య స‌ద‌స్సు ఏర్పాట్లను క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదివారం పరిశీలించారు. ఏయూ ఇంజినీరింగ్ క‌ళాశాల‌ మైదానంలో జ‌రుగుతున్న ఏర్పాట్ల‌ను జేసీ మ‌యూర్ అశోక్‌తో క‌లిసి ప‌రిశీలించి పలు సూచ‌న‌లు చేశారు. ప్ర‌తిష్ఠాత్మ‌క కార్య‌క్ర‌మానికి దేశ, విదేశాల నుంచి ప్రముఖులు హాజ‌ర‌వుతార‌న్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.

News November 9, 2025

రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీకి షాకింగ్ కలెక్షన్లు

image

రష్మిక లీడ్ రోల్‌లో నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు ఆశించినస్థాయిలో రావట్లేదు. తొలి రోజు తెలుగు, హిందీలో ₹1.30 కోట్లు, రెండో రోజు ₹2.50 కోట్లు నెట్ కలెక్షన్లు వచ్చినట్లు Sacnilk వెల్లడించింది. ఇవాళ ఆదివారం కావడంతో కలెక్షన్లు పెరగొచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు బుక్ మై షోలో D1 34K టికెట్లు అమ్ముడవగా, D2 68Kకు పెరిగినట్లు గీతా ఆర్ట్స్ పేర్కొంది.