News January 28, 2025
ముస్తాబైన కూడవెల్లి రామలింగేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణం

ప్రతి సంవత్సరం మాఘపు అమవాస్య సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన సిద్దిపేట జిల్లా కూడవెల్లి రామలింగేశ్వర స్వామి జాతర బుధవారం నుంచి అంగరంగ వైభవంగా మొదలవనుంది. ఈ జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ జాతర 5 రోజులు సాగనుంది. ఈ జాతరకి మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్, కర్ణాటక హైదరాబాద్ నుంచి భక్తులు అధికంగా విచ్చేసి స్వామి వారి ఆశీర్వాదాలు అందుకోవాలని ప్రధానార్చకుడు సాకేత్ శర్మ తెలిపారు.
Similar News
News July 4, 2025
కాసేపట్లో మోస్తరు నుంచి భారీ వర్షం: వాతావరణ కేంద్రం

TG: కాసేపట్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. హైదరాబాద్ నగరంలో రాత్రి 9 గంటల తర్వాత అరగంట పాటు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఆదిలాబాద్, గద్వాల, ఆసిఫాబాద్, MBNR, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి వర్షం వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
News July 4, 2025
IIIT విద్యార్థుల జాబితా విడుదల

TG: 2025-26 విద్యా సంవత్సరానికి IIITలకు ఎంపికైన విద్యార్థుల జాబితాను ఇన్‌ఛార్జ్ వీసీ విడుదల చేశారు. 20,258 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా తొలి విడతలో 1,690 మందిని ఎంపిక చేశారు. విద్యార్థులకు టెన్త్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ ఎంపిక జరగ్గా, 88శాతం సీట్లు ప్రభుత్వ స్కూళ్లలో చదివిన వారికే దక్కాయి. ఎంపికైన విద్యార్థులకు జులై 7, 8, 9 తేదీల్లో యూనివర్సిటీ క్యాంపస్‌లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. <
News July 4, 2025
ములుగు జిల్లాలో పేలిన మందుపాతర

ములుగు జిల్లాలో మరోసారి మందుపాతర పేలింది. స్థానికులు తెలిపిన వివరాలు.. వెంకటాపురం మండలం తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని చెలిమల గుట్టలపై శుక్రవారం మందుపాతర పేలింది. ఈ ఘటనలో పాత్రపురం పంచాయతీ ముకునూరు పాలెం గ్రామానికి చెందిన వృద్ధుడు సోయం కామయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.