News January 28, 2025
‘మ్యాన్ ఈటర్’ పొట్టలో మహిళ వెంట్రుకలు, రింగులు

కేరళలోని వయనాడ్‌లో రాధ (45) అనే మహిళను తిన్న ‘మ్యాన్ ఈటర్’ పొట్టలో ఆమె అవశేషాలు కనిపించాయని అధికారులు నిర్ధారించారు. పోస్టుమార్టంలో ఆమె వెంట్రుకలు, చెవి రింగులు పులి పొట్టలో లభించినట్లు తెలిపారు. పులి కోసం అటవీ అధికారులు వేటాడుతుండగా ఓ పాడుబడిన ఇంట్లో చనిపోయి కనిపించింది. వెంటనే దానికి పోస్టుమార్టం నిర్వహించారు. టీమ్ ఇండియా క్రికెటర్ మిన్ను మణికి మృతురాలు రాధ సమీప బంధువు అన్న విషయం తెలిసిందే.
Similar News
News January 7, 2026
నెల్లూరులో టాటా పవర్ అతిపెద్ద ప్లాంట్.. ₹6,675 కోట్ల పెట్టుబడులు!

AP: నెల్లూరులో టాటా సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టనుంది. టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ(TPREL) ₹6,675 కోట్లతో 10GW సామర్థ్యంతో ఇంగాట్, వేఫర్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఇది దేశంలోనే అతిపెద్ద ఇంగాట్, వేఫర్ తయారీ సెంటర్‌గా నిలవనుంది. సెమీకండక్టర్ చిప్స్, సోలార్ సెల్స్, మాడ్యూల్స్ ఉత్పత్తిలో ఈ మెటీరియల్స్ చాలా కీలకం. ఈ సంస్థ రాకతో ప్రత్యక్షంగా 1000 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి.
News January 7, 2026
అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ

AP CM చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, నియామకాలపై చర్చించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రానికి తగిన నిధులు కేటాయించాలని వినతి పత్రాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న నిధులు, పెండింగ్ అంశాలు, అమరావతి శాశ్వత రాజధాని బిల్లుపైనా చర్చించారు. బడ్జెట్ సమావేశాల్లో అమరావతి శాశ్వత రాజధాని బిల్లు పెట్టే అవకాశం ఉంది.
News January 7, 2026
‘జన నాయగన్’ వాయిదా.. రాజాసాబ్‌కు జాక్‌పాట్

విజయ్ దళపతి నటించిన ‘జన నాయగన్’ సినిమా వాయిదా పడటంతో ప్రభాస్ ‘రాజాసాబ్’ జాక్‌పాట్ కొట్టింది. తమిళనాడులోని దాదాపు అన్ని మెయిన్ థియేటర్లలో జన నాయగన్ స్థానంలో రాజాసాబ్‌కు షోలు కేటాయిస్తున్నారు. దీంతో పండుగ వేళ తెలుగుతో పాటు తమిళంలో భారీగా కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది. కాగా ఈ రెండు సినిమాలు జనవరి 9కి రిలీజ్ కావాల్సి ఉండగా, సెన్సార్ సమస్యలతో విజయ్ మూవీ వాయిదా పడినట్లు తెలుస్తోంది.


