News January 28, 2025

MNCL: పదో తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్

image

జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల పదో తరగతి విద్యార్థులకు ఫోరం ఆఫ్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ ఆధ్వర్యంలో సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు డీఈఓ యాదయ్య తెలిపారు. 29న పాఠశాల, 31న మండల, ఫిబ్రవరి 4న జిల్లా, 12న రాష్ట్రస్థాయిలో ఆన్‌లైన్ పద్ధతిలో టాలెంట్ టెస్ట్ జరుగుతుందన్నారు. పోటీల్లో విద్యార్థులు తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు.

Similar News

News November 9, 2025

పర్వతగిరి: కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు కలెక్టర్ సూచనలు..!

image

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు కలెక్టర్ సత్య శారద సూచనలు చేశారు. ప్రతి రైతు ధాన్యాన్ని 100% ప్యాడీ క్లీనర్ ద్వారా శుభ్రం చేసుకుంటేనే మిల్లువారు ఎలాంటి కటింగ్ లేకుండా 41kgకి అంగీకరిస్తారన్నారు. మిల్లులో అన్ లోడింగ్ ఐన మరుక్షణమే OPMS పూర్తి చేసి, 24గంటల్లో రైతుఖాతాలో డబ్బులు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యాన్ని నేల మీద కాకుండా కవర్ల మీదే పోయాలని, ప్రతి కుప్ప చుట్టూ చిన్న కందకం చేయాన్నారు.

News November 9, 2025

NLG: ఇక్కడి నాయకులంతా అక్కడే..!

image

ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైనే చర్చ జరుగుతోంది. సిటీకి దగ్గరగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులంతా HYDలోనే మకాం వేశారు. ఈ ఉప ఎన్నికను కాంగ్రెస్, BRS, BJP ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఇక్కడి నాయకులంతా అక్కడ ప్రచారంలో పాల్గొంటున్నారు. పోటాపోటీగా కొనసాగుతున్న ప్రచార పర్వంలో తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు.

News November 9, 2025

పత్తి కొనుగోళ్లపై ఆ నిబంధన ఎత్తేయండి: తుమ్మల

image

ఖమ్మం: పత్తి కొనుగోళ్లలో ఉన్న నిబంధనలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీసీఐ సీఎండీ లలిత్ కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఎకరాకు 7 క్వింటాళ్ల కొనుగోలు పరిమితిని తక్షణమే ఎత్తివేసి, పాత విధానంలో కొనుగోళ్లు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. 20 శాతం తేమ ఉన్న పత్తిని కూడా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.